Kapil Dev backs MS Dhoni, cites Sachin ధోనికి కపిల్ మద్దతు.. సచిన్ పేరును ప్రస్తావన

Kapil dev cites sachin tendulkar s example in support of ms dhoni

kapil dev, ms dhoni, sachin tendulkar, vvs laxman, indian national cricket team, bcci, cricket news, sports news, sports, latest sports news, cricket

Former India captain Kapil Dev has voiced his support for the veteran wicketkeeper MS Dhoni and said that he expects him to continue at the top of his game for another few years.

ధోనికి కపిల్ మద్దతు.. సచిన్ పేరును ప్రస్తావన

Posted: 11/11/2017 08:26 PM IST
Kapil dev cites sachin tendulkar s example in support of ms dhoni

టీమిండియాకు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ.. టీమిండియాకు గొప్ప ఆస్తి అని దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ అన్నారు. సునీల్‌ గావస్కర్‌ వలె ధోనీ కూడా భారత జట్టుకు గొప్ప ఆస్తి అని తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు సన్నీ చాలా సలహాలు తీసుకునేవాడినని అన్నాడు. అలాంటి ఆటగాళ్లు జట్టులో ఉండటం వల్ల మిగతా ఆటగాళ్లకు ఎంతో లాభమని అన్నాడు. ధోనీ ఎంతో వినయం కలవాడని.. మంచి క్రికెట్‌ మైండ్‌ ఉన్న వ్యక్తి. ధోనీ కంటే మెరుగైన వ్యక్తి దొరికేవరకు అతను వన్డేలు, టీ20 ఆడొచ్చునని అన్నాడు.

ఇంతలా ధోనిపై ప్రశంసలు కురిపించిన కపిల్ చివరాఖరున మాత్రం ఇదంతా తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అన్నాడు. ఇప్పటికీ అతను ఎంతో ఫిట్‌గా కోహ్లీకి పోటీగా కనిపిస్తాడు. అతడు భారత జట్టుకు గొప్ప ఆస్తి అని ఎప్పుడైనా చెబుతానని కపిల్‌ దేవ్‌ అన్నారు. ప్రస్తుత ఆటగాళ్లలో ఎవరైనా అతని స్థానంలో ఫిట్‌ అవుతారా అని అడిగిన ప్రశ్నకు ‘ప్రస్తుతం అతని స్థానంలో సరితూగే వారు ఎవరూ లేరు. ఎందుకు ఇలాంటి ప్రశ్నకు అడుగుతూ సమయం వృథా చేసుకుంటారు. టీమిండియాకు ధోనీ గొప్ప ఆస్తి అని చెబుతున్నాను కదా’ అని విలేకరులపై కపిల్‌ కాస్త అసహనం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kapil dev  ms dhoni  sachin tendulkar  vvs laxman  indian national cricket team  cricket  

Other Articles