టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోల్ కతా వేదికగా భారత్ - శ్రీలంక జట్ల మధ్య ఈ నెల 16 నుంచి ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న టెస్టు మ్యాచ్ లో ఆయన పరీక్ష చేశారు. అదేంటి టెస్టు క్రికెట్ నుంచి దాదాపు మూడేళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోని ఈడెన్ గార్డెన్స్ లో పరీక్షను ఎందుకు చేశాడు అంటారా..? అసలు అయనకు టెస్టు క్రికెట్ తో సంబంధమేమిటీ అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయా..? 2014లో అస్ట్రేలియాతో సిరీస్ ను ముగించిన వెనువెంటనే ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన టెస్టులకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.
అప్పటికే సుమారుగా.. 90 టెస్టు మ్యాచ్ ల్లో 4,876 పరుగులు చేసిన ధోనికి లంకతో జరిగే టెస్టుకు ఈడెన్ కు ఎందుకు చేరుకున్నాడు, పిచ్ ను ఎందుకు పరీక్షించాడు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నయా..? టెస్టులకు వీడ్కోలు పలికిన ఆయన తనకు సంబంధం లేదని వెళ్లకుండా ఈడెన్ కు వచ్చిన సందర్భంగా గ్రౌండ్ క్యూరేటర్ సుజాన్ ముఖర్జీతో కలసి ముచ్చటించి.. పిచ్ తయారీపై వివరాలను అడిగి తెలుసుకున్నాడు. ఇది ఆయనలోని క్రికెట్ పై వున్న మక్కువను, అసక్తిని తెలియజేస్తుంది.
దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక వ్యాపార ప్రకటన కోసం ఈడెన్ కు వచ్చారు. దీనిలో భాగంగా 58 ఏళ్ల కపిల్ తనదైన శైలిలో బౌలింగ్ చేయగా... 36 ఏళ్ల ధోని తన బ్యాటింగ్ ప్రత్యేకతను ప్రదర్శిస్తూ ఈడెన్ గార్డెన్ లో షూటింగ్ లో పాల్గొన్నాడు. దీనికి క్యాబ్ (క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అనుమతి ఇవ్వడంతో ఇక్కడ షూటింగ్ జరిగింది. షూటింగ్ విరామ సమయంలో ధోని పిచ్ వద్దకు వెళ్లి పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Feb 27 | దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్‌కు కెప్టెన్ మిథాలీ రాజ్, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సభ్యుల... Read more
Feb 27 | ఇంగ్లండ్‌తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్‌బౌలర్ అహ్మదాబాద్ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత... Read more
Feb 16 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేయగా, అందులో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. పర్యాటక జట్టుపై ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమిని చవిచూసిన టీమిండియా జట్టు చెన్నైలో జరిగిన రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పర్యాటక జట్టును కేవలం 56... Read more