ధోని స్థానంలోకి రావాలంటే సాధన చాలా అవసరం.. ధోని స్థానంలోకి రావాలంటే సాధన చాలా అవసరం..

Number 4 is a great best position for me to bat dinesh karthik

dinesh karthik, virat kohli, mahendra singh dhoni, indian national cricket team, India vs New Zealand, MS Dhoni, Team india, bcci,sports news, cricket news, cricket news, sports news, Team India, cricket

After making a comeback into the Indian side wicketkeeper Dinesh Karthik has said that he feels privileged to be part of a side led by Virat Kohli.

ధోని స్థానంలోకి రావాలంటే సాధన చాలా అవసరం..

Posted: 10/17/2017 05:58 PM IST
Number 4 is a great best position for me to bat dinesh karthik

న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ కు ఎంపికైన టీమిండియా వికెట్ కీపర్ దినేశ కార్తీక్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సేనలో ఒక్కడిగా పోరాటంలో దిగుతున్నందుకు ఆనందం వ్యక్తంచేశాడు. జట్టులో తిరిగి స్థానం లభించడంపై మాట్లాడుతూ కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంపై ప్రశంసల వర్షం కురిపించాడు. అదే సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తరహాలో కీపింగ్ చేయాలంటే సాధన చాలా అవసరమని చెప్పాడు.

తాను కీపర్ గా చేయడం కన్న న్యూజీలాండ్ తో సిరీస్ నేపథ్యంలో ఎక్కడైనా ఫీల్డింగ్ చేస్తానని చెప్పాడు. అయితే ధోని స్థానంలో కీపింగ్ చేయాలంటే మాత్రం తనకు ఇంకొంత సాధన అవసరమని చెప్పాడు. అదే సమయంలో పనిలో పనిగా తన మనస్సులోని మాటను కూడా బయటపెట్టాడు కార్తీక్. తనకు నాలుగోస్థానంలో బ్యాటింగ్ బరిలోకి దిగాలని వుందని చెప్పకనే చెప్పేశాడు. దేశీయ క్రికెట్ లో తమిళానాడు తరపున అడుతున్న తాను ప్రస్తుతం నాలుగో స్థానంలోనే బరిలోకి దిగుతున్నానని, తెలుపు వర్ణం బంతితో తాను చక్కగా రాణిస్తున్నానన్నాడు

అదే స్తానంలో తాను న్యూజీలాండ్ తో కూడా బరిలోకి దిగితే తాను తప్పక రాణించగలనన్నా నమ్మకం తనకుందని అన్నాడు. కోహ్లీ సారథ్యంలో జట్టు మెరుగ్గా రాణిస్తోందని పేర్కొన్న దినేశ్ ఇటువంటి జట్టులో తనకు చోటు లభించడం ఆనందంగా ఉందన్నాడు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని పేర్కొన్నాడు. కోహ్లీ ఎప్పుడూ విజయాన్నే కోరుకుంటాడని కితాబిచ్చాడు. ఇకపై తాను మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తానని దినేశ్ కార్తీక్ వివరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs New Zealand  Virat kohli  dinesh karthik  MS Dhoni  Team india  bcci  cricket  

Other Articles