Rohit Sharma Reveals Secret of Team India's Success టీమిండియా విజయాలకు కారణం అదే: రోహిత్

Rohit sharma credits collective team effort for team india s success

MS Dhoni, India vs New Zealand, yuvraj singh, Team India, Bhuvneshwar Kumar, India vs New Zealand 2017, jasprit bumrah, kl rahul, MS Dhoni, rohit sharma, shikhar dhawan, virat kohli, sports news, cricket, news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Star batsman Rohit Sharma has said that playing as a cohesive unit has been the primary reason for Indian cricket team's stupendous success across formats in recent times.

టీమిండియా విజయాలకు కారణం అదే: రోహిత్

Posted: 10/17/2017 06:49 PM IST
Rohit sharma credits collective team effort for team india s success

టీమిండియా వరుస విజయాల వెనుక ఉన్న అసలు రహస్యమేమిటో జట్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎలాంటి మర్మం లేకుండా చెప్పేశాడు. జట్టులోని ఆటగాళ్లందరూ కలిసికట్టుగా రాణించడమే వరుస విజయాలకు కారణమని చెప్పాడు. ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ విజయం ప్రతి ఒక్కరిదని అన్నాడు. తాము నగరానికో, దేశానికో అడుతున్నమన్నా భావనతో కాకుండా గెలుపును అందుకోవాలన్న అకాంక్షతో బరిలోకి దిగుతున్నామని అదే తమకు విజయాలను అందజేస్తుందని అన్నాడు.

అయితే అది అంత సులభం కాదు. తాము వరుసగా ఆరు సిరీస్‌లు గెలిచామని. కలిసికట్టుగా రాణించడంతోనే ఈ విజయాలు సులువుగా సాధ్యమయ్యాయన్నారు. కేవలం ఒకరిద్దరి వల్ల టోర్నీలు గెలవలేమని చెప్పాడు. ప్రపంచకప్ కు చాల సమయం ఉందని ఈ సమయంలో అప్పుడే దాని గురించి మాట్లడటం సమంజసం కకపోగా చాలా తొందపాటు వ్యాఖ్యలుగా మిగులుతాయని అన్నాడు. అయితే ప్రపంచ కప్ లక్ష్యంగానే టీమిండియాలోని ప్రతీఒక్కరూ ముందుకు సాగుతున్నామని అన్నారు.

కెప్టెన్‌, కోచ్‌, సెలక్టర్లు ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకొని జట్టును సిద్దం చేస్తున్నారు. టీం మేనేజ్ మెంట్‌ ఆటగాళ్ల నుంచి ఏం ఆశిస్తుందో ఆటగాళ్లందరికి తెలుసునని రోహిత్‌ వ్యాఖ్యానించారు. ఇక న్యూజిలాండ్‌ సిరీస్‌ ప్రణాళికలను ప్రస్తావించగా.. ఇప్పటికీ ఎలాంటి ప్రణాళికలు లేవు. జట్టు సభ్యులంతా హోటల్ కు చేరిన మరుక్షణం మా ప్రణాళికలను ప్రారంభిస్తాం. రెండు రోజుల క్రితమే ఓ సిరీస్ ను గెలుపుతో ముగించాం. మా ప్రత్యర్థిని ఓడించడం.. తద్వారా విజయాలను అందుకోవడమే తమ లక్ష్యమని ఈ ముంబై ఆటగాడు చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit Sharma  India vs New Zealand  ms dhoni  virat kohli  Team India  victories  cricket  

Other Articles