Bowl reasonably quick: Santner's plan in India విరాట్ సేనను కట్టడి చేయడం కష్టమే.. ఐనా..

Mitchell santner is learning from video footage of axar patel

Hardik Pandya, India vs New Zealand 2017, Kane Williamson, mitchell santner, MS Dhoni, rohit sharma, shikhar dhawan, virat kohli, cricket news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

New Zealand spinner Mitchell Santner said the key to success against India’s batsmen would be to bowl quick and cause them to make mistakes.

విరాట్ సేనను కట్టడి చేయడం కష్టమే.. ఐనా..

Posted: 10/16/2017 07:42 PM IST
Mitchell santner is learning from video footage of axar patel

టీమిండియాను కట్టడి చేయడం అంత సులభమైన పనికాదని, పటిష్ఠ బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న విరాట్ సేనను నియంత్రించడం కష్టమేనని న్యూజిలాండ్ బౌలర్ మిచెల్ శాంట్నర్ అన్నారు. త్వరత్వరగా బంతులు విసిరి బ్యాట్స్‌మెన్‌ను పొరపాట్లు చేయించడంలోనే విజయం దాగుందని పేర్కొన్నారు. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్‌ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. టీమిండియాకు బౌలింగ్‌ చేయడం చాలా కష్టం. స్పిన్‌ను అద్భుతంగా ఆడగలరని అన్నాడు. వారు అందులోనే పుట్టి పెరిగారని కూడా వ్యాఖ్యానించారు.

నేను సింపుల్‌గా బౌలింగ్‌ చేయడానికే ప్రయత్నిస్తా. సరైన ప్రాంతంలో బంతిని త్వరగా విసిరి బ్యాట్స్‌మన్‌ పొరపాటు చేసేలా చేస్తా. అలా బంతులు వృథాచేసి ఒత్తిడి పెంచితే వికెట్లు తీయడం సులభమే. నేనదే చేయబోతున్నా. ప్రపంచంలోనే అత్యుత్తమైన బ్యాట్స్‌మన్‌ కోహ్లీకి బంతులేయడం చాలా కష్టం. అతడే కాదు జట్టంతా అలాగే ఉంది. ఆస్ట్రేలియాపై వారు చక్కగా ఆడారు. గతసారి ఇక్కడ బాగానే ఆడాం. ఇప్పుడూ అలాంటి మంచి ప్రదర్శనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఉపఖండంలో నాకున్న అనుభవం ఉపయోగించి బౌలింగ్‌ చేస్తా’ అని శాంట్నర్‌ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  icc cricket  team indian  new zealand  Mitchell Santner  quick bowling  mistakes  cricket  

Other Articles