Pressure will be on Kuldeep says David Warner హ్యాట్రిక్ వీరుడు కుల్దీప్ పైనే ఒత్తడి.. నాపై కాదు

Pressure will be on kuldeep yadav to perform not me david warner

David Warner, India vs Australia, Virat Kohli, ODI cricket, Kuldeep Yadav, Team India, india cricket team, cricket news, sports news, sports, cricket

David Warner said he liked Kuldeep Yadav's confidence, days after the left-arm chinaman bowler took a jibe at the Australian vice-captain.

కుల్దీప్ పైనే ఒత్తడి.. నాపై కాదు

Posted: 09/22/2017 08:07 PM IST
Pressure will be on kuldeep yadav to perform not me david warner

భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అసీస్ వైస్ కెప్టెన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను పడగొట్టిన సందర్భంగా మిగిలిన నాలుగు మ్యాచులలో మరోమారు కూడా వార్నర్ వికెట్ ను తీసుకుంటానని ధీమా వ్యక్తం చేయడంపై స్పందించిన వార్నర్ నిస్సందేహంగా కుల్దీప్ యాదవ్ మంచి బౌలర్ అని కితాబిచ్చాడు. అయితే అతన్ని ఎదుర్కోవడంలో తాను ఎలాంటి ఒత్తడిని ఎదుర్కోవడం లేదని స్పష్టం చేసిన వార్నర్.. అసలు ఒత్తడి కుల్దీప్ పైనే వుంటుందని స్పష్టం చేశారు.

కెరీర్ తొలి దశల్లో ఉన్న కుల్దీప్ పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, నా కెరీర్ ప్రారంభంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని వార్నర్ అభిప్రాయపడ్డారు. కానీ కుల్దీప్‌ దైర్యం ఆకట్టుకుందని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపాడు. కొల్ కతా వేదికగా జరిగిన రెండో వన్డేలో కుల్దీప్ హ్యాట్రిక్ సాధించడాన్ని ప్రశంసించిన వార్నర్ రాబోయే రోజుల్లో అయన గొప్ప బౌలర్ అవుతాడని కితాబిచ్చారు. ఇక కుల్దీప్ వరుస బంతుల్లో వేడ్‌, అగర్‌, ప్యాట్ కమ్మిన్స్ లను అవుట్ చేసి వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత స్పిన్నర్ గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

అయితే చెన్నై వేదికగా జరిగిన తొలి వన్డేలో వార్నర్.. కల్దీప్ బౌలింగ్ లోనే అవుటయ్యాడు. రెండో వన్డేలో మాత్రం ఆరంభంలోనే భువనేశ్వర్ బౌలింగ్ లో అవుటవ్వడంతో కుల్దీప్ బంతులను ఎదుర్కొనే అవకాశం రాలేదు. ఇక వార్నర్ మాటలను బట్టి అతడు కుల్దీప్ బౌలింగ్ ఎదుర్కోవడానికి ఎంత దిగులు చెందుతున్నడో అతని మాటల్లోనే వ్యక్తమవుతుంది. ఈ చైనామన్ తన ధర్మశాల అరంగేట్ర మ్యాచ్ లోనే వార్నర్ వికెట్ పడగొట్టాడు. ఇక వార్నర్ కు బంతులేయడాన్ని ఆస్వాదిస్తానని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : David Warner  India vs Australia  Virat Kohli  ODI cricket  Kuldeep Yadav  cricket  

Other Articles