Dhoni Could Be Ignored For Padma Bhushan ధోని అశ నిరాశేనా..? బిసిసిఐ సిఫార్సు వృధాయేనా..?

Why ms dhoni could be ignored for padma bhushan

MS Dhoni, Padma Bhushan, Mahendra Singh Dhoni, Sachin Tendulkar, Rahul Dravid, Kapil Dev, BCCI, india Cricket, cricket news, cricket, sports news, latest cricket news, latest sports news, cricket

It's hardly surprising considering the fact that Former Indian skipper MS Dhoni is the only Indian captain to have won two world titles (2011 ODI World Cup and 2007 World T20).

ధోని అశ నిరాశేనా..? బిసిసిఐ సిఫార్సు వృధాయేనా..?

Posted: 09/22/2017 07:21 PM IST
Why ms dhoni could be ignored for padma bhushan

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించనుందా..? అంటే నిన్నటి వరకు ఔను అన్న సంకేతాలు కాస్తా అనుమానమేనన్నవిగా మారిపోయాయి. గతంలో ఇలాంటి పరాభవాలనే ఎదుర్కోన్న ధోని.. వచ్చిన తరువాత చూద్దములే అని అనుకున్నా.. బిసిసిఐ మాత్రం మహేంద్ర సింగ్ ధోని మినహా మరెవరి పేరును క్రీడామంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయలేదు. దీంతో ఇక తప్పక మహేంద్రుడికి అవార్డు దక్కుతుందని భావించినా.. దానిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటున్నాయి సంబంధిత వర్గాలు.

టీమిండియాకు రెండు ప్రపంచకప్లు(2007 ట్వంటీ 20 వరల్డ్ కప్,2011 వన్డే ప్రపంచకప్) సాధించిన ఘనత ధోనిది. మరొకవైపు దాదాపు పదివేల వన్డే పరుగులకు కూడా ధోని చేరువయ్యాడు. ఇటీవల మూడొందల వన్డేను పూర్తి చేసుకున్న ధోని..ఈ ఘనత సాధించిన అరుదైన క్రికెటర్ల జాబితాలో కూడా చేరిపోయాడు. అదే క్రమంలో వన్డేల్లో వంద స్టంపింగ్లతో సరికొత్త రికార్డును ధోని లిఖించాడు. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సిఫారుసు చేసినా.. ఈ సారి కూడా ఆ సిఫార్సుతో పెద్దగా ప్రయోజనం కలిగేట్టు ఏమీ లేదు. అంటే ఈ సారి కూడా ధోనికి అవార్డును అందించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

గతంలో ఈ అవార్డుకు 2013, 16ల్లోనూ ధోని పేరును బీసీసీఐ నామినేట్ చేసినా అప్పట్లో కేంద్రం తిరస్కరించింది. 2013 ఐపీఎల్లో భాగంగా స్పాట్ ఫిక్సింగ్ కేసులో ధోని పేరు కూడా తెరపైకి రావడంతో అప్పటి ప్రభుత్వం అవార్డును అందించేందుకు విముఖత వ్యక్తం చేసింది. దర్యాప్తు సంస్థల విచారణలో ఆయన పేరు తెరపైకి వస్తే.. అవార్డును తిరిగి తీసుకోవాల్సి వస్తుందని.. అందుచేత ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు అతని పేరును తిరస్కరించారు. కాగా ఆ తరువాత 2016లో కూడా ఆయన పేరును సిఫార్సు చేసినప్పుడు కూడా ధోని పేరు తిరస్కరణకు గురైంది. అయితే అయన పేరును ఈ అవార్డుకు ఎందుకు తిరస్కరిస్తున్నారన్న విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వడం లేదు.

ఇక తాజాగా ఈ పర్యాయం కూడా బిసిసిఐ ధోని పేరును అవార్డుకు రికమెండ్ చేసినా.. మరోమారు నిరాశకు గురికాక తప్పదన్న వార్తలు వినబడుతున్నాయి..? బిసిసిఐ కేవలం ధోని ఒక్కడి పేరునే సిఫార్సు చేసినా.. వృధా అవుతుందా..? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. 2013 ఐపీఎల్ లో చోటుచేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ అరోపణల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ హోదాలో ధోనిని విచారించిన దర్యాప్తు సంస్థలకు సీఎస్కేకు గురునాథ్ మెయప్పన్ కు సంబంధమేటన్న విషయమై అడిగిన ప్రశ్నలకు ఆయన సరైన సమాధానం ఇవ్వలేదని, ఉద్దేశపూర్వకంగా అబద్దాలను చెప్పారని సమాచారం.

ఇక దీనికి తోడు ధోని.. అప్పటి బిసిసిఐ చైర్మన్, చెన్నై సూపర్ కింగ్స్ ఎలివన్ జట్టు యజమాని ఎన్ శ్రీనివాసన్ కు చెందిన ఇండియ సిమెంట్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతులు తీసుకోవాడానికి అనుమతులు లేవని అయినా అదెలా సాధ్యమయ్యిందని జస్టిస్ ముద్గుల్ కమిటి విచారణలో భాగంగా తెరపైకి తీసుకువచ్చిందని పద్మభూషణ్ అవార్డుల కమిటీలో సభ్యుడైన ఓ క్రీడామంత్రిత్వ శాఖ అధికారి గతేడాది మీడియాకు వెలువరించారు. దీంతో ఈ సారి కూడా అతనికి ఇవే ప్రాతిపదికలపైన పద్మభూషన్ అవార్డు ఇవ్వకపోవచ్చునని తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  Padma Bhushan  BCCI  sports ministry  central government  sports news  cricket  

Other Articles