David Warner hits back in bitter Australia pay row క్రికెట్ బోర్డుపై నిప్పులు చెరిగిన డేవిడ్ వార్నర్

David warner criticises cricket australia over ongoing pay dispute

Cricket Australia, David Warner, Australian Cricketers Association, ACA, cricket news, cricket, sports news, latest news

Australia vice-captain David Warner has accused Cricket Australia of wrongly blaming players for not resolving a bitter pay dispute saga which threatens next month's Test tour to Bangladesh.

క్రికెట్ బోర్డుపై నిప్పులు చెరిగిన డేవిడ్ వార్నర్

Posted: 07/28/2017 07:04 PM IST
David warner criticises cricket australia over ongoing pay dispute

నూతన కాంట్రాక్ట్‌ వివాదానంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో వూర్తిగా విఫలమైన క్రికెట్ అస్ట్రేలియా (సీఏ)పై ఆ దేశ క్రికెటర్ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ నిప్పులు చెరిగారు. సీఏ తన తప్పులను లెక్కపెట్టకుండా ఆటగాళ్లను నిందించడం సరికాదని మండిపడ్డాడు.. ఈ వివాదం పరిష్కరించకపొతే ఆగష్టులో బంగ్లదేశ్ పర్యటనకు ముప్పు వాటిల్లుతుందని వార్నర్‌ హెచ్చరించాడు. కాంట్రాక్టు ఒప్పందాన్ని పరిస్కరించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు అటగాళ్లు సహకరించడం లేదని క్రికెట్ అస్ట్రేలియా ఆరోపించింది. దీనికి వార్నర్ తన ఇన్ స్ట్రాగ్రమ్ లో ఘాటుగా స్పందించాడు.
 
ఆస్ట్రేలియా పురుషులు, మహిళా క్రికెటర్లందరూ దేశం తరుపున ఆడాలని ఉన్నా.. క్రికెట్ అస్ట్రేలియా మాత్రం సమస్యకు పరిష్కారం చూపడం లేదని విమర్శించారు. అయితే తమ మానన తాముంటే.. తమపై సీఏ నిందలు వేయడం ఏమిటని ప్రశ్నించాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) 30 మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లు ప్రతిపాదించిందని దీనికి సీఏ అంగీకరించకుండా సంక్షోభం ముదిరేలా చేసిందని వార్నర్ పేర్కొన్నాడు. వివాదం పరిష్కారం కాక క్రికెటర్లంతా నిరుద్యోగులయ్యారని, ఆర్ధిక పరిస్థితులతో సతమతమవుతున్న క్రికెట్లో కొనసాగుతున్నారని వార్నర్ ఆవేదన వ్యక్తం చేశారు.
 
అడ్మినిస్టేటర్లకు మాత్రం డబ్బుల ముట్టాయని.. వారికి ఎలాంటి దిగులు లేదని ఘాటుగా వ్యాఖ్యానించాడు. గత జూన్‌లో క్రికెటర్లకు సీఏకు కాంట్రాక్టు ఒప్పందం ముగియడంతో 230 మంది క్రికెటర్లు నిరుద్యోగులుగా మారారని అయినా సీఏకు మాత్రం ఏమీ పట్టడం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వివాదం పరిష్కారం కాకపోతే నవంబరులో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ప్రమాదంలో పడునుంది. ఇప్పటికే కొంత మంది ప్లేయర్లు ఇతర దేశాల్లో జరిగే టీ-20 లీగ్ లు ఆడుతున్నారని వార్నర్ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pay Dispute  David Warner  James Sutherland  Cricket Australia  cricket  

Other Articles