IND vs SL: IND aim to continue dominance లంకేయులను చిత్తు చేసిన టీమిండియా బౌలర్లు..

Ind vs sl ind aim to continue dominance

Angelo Mathews, Cheteshwar Pujara, Abhinav Mukund, Hardik Pandya, India vs Sri Lanka 2017, India vs Sri Lanka Test series, mohammed shami, sri lanka vs india, virat kohli, Ind vs SL, india cricket team, sri lanka vs india, cricket news, sports news, sports, cricket

India put on a dominant display against Sri Lanka on day 3 of the Galle Test and Virat Kohli’s side will be aiming to continue the dominance on day 4.

లంకేయులపై పట్టుబిగిస్తున్న టీమిండియా.. భారీ అధిక్యం..

Posted: 07/28/2017 07:56 PM IST
Ind vs sl ind aim to continue dominance

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ అభినవ్ ముకుంద్ సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్ లో విఫలమై విమర్శకులకు టార్గెట్ గా మారిన ముకుంద్.. రెండో ఇన్నింగ్స్ లో తన మార్కు బ్యాటింగ్ చేస్తున్నాడు. టీమిండియా కెప్టన్ విరాట్ కోహ్లీతో స్థిరంగా అడుతూ అర్థశతకాన్ని నమోదు చేశాడు. అయితే మూడవ రోజు అట ముగిసే సమయంలో ముకుంద్ ఎల్బీడబ్యూ రూపంలో పెవీలియన్ కు చేరాడు. దీంతో మూడవ రోజు అటను ఎంఫైర్లు ముగించారు. మూడవ రోజు అటముగిసే సమయానికి టీమిండియ రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు సాధించింది.

ఇవాళ మధ్యాహ్నం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. అదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. ధాటిగా అడి భారత్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాలన్న క్రమంలో తొలి ఇన్నింగ్స్ లో 190 పరుగులు సాధించిన శిఖర్ ధావన్ 12 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ధీరువన్ పెరీరా విసిరన బంతిని ఫాట్ కోట్టబోయి డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన ఛటేశ్వర్ పూజారా కూడా లహిరు కుమార విసిరన బంతిని ప్లిక్ చేసే క్రమంలో అది కాస్తా కుసల్ మెండిస్ క్యాచ్ పట్టడంతో 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. ఆ వెంటనే వర్షం కురవడంతో మ్యాచు కొద్ది సేపు నిలిచిపోయింది.

మ్యాచ్ తిరిగి ప్రారంభమైన తరవాత కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలసి ఓపెనర్ అభినవ్ ముకుంద్ నిలకడగా అడాడు. ఈ క్రమంలో అభినవ్ ముకుంద్ ఏడు బౌండరీల సాయంతో అర్థశతకాన్ని నమోదు చేయగా, అటు విరాట్ కోహ్లీ కూడా నాలుగు బౌండరీల సాయంతో అర్థశతకాన్ని నమోదు చేశాడు. కెప్టెన్ తో కలసి ముకుంద్ కూడా చకచకా సింగిల్స్ తీయడంతో పాటు చెడు బంతులను బౌండరీలకు తరలించాడు. చివరగా ధనుష్క గుణతిలక విసిరిన బంతికి బీట్ కావడంతో అది కాస్తా కాలికి తగిలింది. దీంతో ముకుంద్ వెనుదిరగాల్సి వచ్చింది.

ఇవాళ ఉదయం టీమిండియా బౌలర్లు తమదైన శైలిలో పదునైన బంతులను విసురుతూ.. అతిథ్యజట్టుకు కట్టడి చేశారు. ఫలితంగా లంకేయులను 291 స్కోరుకు అటౌట్ చేశారు. అనుకున్నట్లే టీమిండియా శ్రీలంకను ఫాలో ఆన్ అడించే అవకాశమున్నప్పటికీ.. బౌలర్లకు విశ్రాంతిని కల్పించాలన్న ఉద్దేశ్యంతో పాటు మ్యాచ్ పై పట్టుబిగించేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ టీమిండియా రెండో ఇన్నింగ్స్ ను అడేందుకు నిర్ణయం తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో లంకపై సాధించిన 309 పరుగుల అదిపత్యానికి మరికొన్ని పరుగులు జోడించిన తరువాత టీమిండియా డిక్లేర్ చేసే అవకాశాలు వున్నాయి.

మరో రెండు వందల పరుగులు చేసిన తరువాత కెప్టెన్ విరాట్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తుంది. కాగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో పెరీరా ఒంటరిపోరు చేశాడు. అయితే ఆయనకు మద్దతుగా ఒక్కరిద్దరు దాటిగా బ్యాటింగ్ చేసినా ఎక్కవ సేపు క్రీజులో నిలవలేకపోయారు. పెరీరా మాత్రం 10 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 92 పరుగులు చేసిన నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో జడేజాకు 3, షమీకి 2, యాదవ్, అశ్విన్, పాండ్యాలకు తలో వికెట్ లభించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Angelo Mathews  Ravindra jadeja  Abhinav Mukund  virat kohli  Ind vs SL  cricket  

Other Articles