Shoaib Akhtar loved to injure this cricketer అతడ్ని గాయపర్చడానికి శతవిధాలా ప్రయత్నించా

Shoaib akhtar says he never enjoyed injuring batsmen

Shoaib Akhtar, Matthew Hayden, ‪Pakistan national cricket team‬, Rawalpindi express, ‪Test cricket‬‬, Australia national cricket team, Twitter, cricket news, cricket, sports news, latest news

Shoaib Akhtar was a menace for batsmen to deal with due to his frightening pace and the former Pakistan bowler recently revealed he enjoyed hitting Matthew Hayden during his playing days.

అతడ్ని గాయపర్చడానికి శతవిధాలా ప్రయత్నించా

Posted: 07/28/2017 06:18 PM IST
Shoaib akhtar says he never enjoyed injuring batsmen

క్రికెట్ ప్రపంచంలో రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరుతెచ్చుకుని అత్యంత వేగంగా బంతులు విసరగల ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన పాకిస్తాన్ ప్లేయర్ షోయబ్‌ అక్తర్ ఒకడు. గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు సంధిస్తూ దిగ్గజ క్రికెటర్లను సైతం పలుమార్లు గాయాలపాలు చేశాడు. అతడి కెరీర్‌లో దాదాపు 19 మంది దిగ్గజ క్రీడాకారులు గాయాలపాలై డ్రెస్సింగ్ రూంకు వెళ్లిపోయారు. ఇది ఆయన ట్రాక్ రికార్డు. అయితే ఈ విషయమై.. రిటైర్మెంట్ తీసుకున్న చానాళ్ల తరువాత ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

ప్రత్యర్థి జట్ల బ్యాట్స్ మెన్లను గాయపర్చడం తనకెంత మాత్రం ఇష్టం ఉండదని అక్తర్ తెలిపాడు. అయితే తన కెరీర్‌లో ఒక క్రికెటర్ ను మాత్రం గాయపర్చాలని తాపత్రయ పడేవాడినని వెల్లడించాడు. ఆ బ్యాట్స్‌ మెన్ మరోవరో కాదు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్నని కూడా చెప్పాడు. అసీస్ తో జరిగిన మ్యాచ్ ల సందర్భంగా టెస్టులు, వన్డేలు, ప్రాక్టీసు మ్యచులు ఇలా ఎక్కడ అవకాశం దొరికినా వాటిని వినియోగించుకునేందుకు ప్రయత్నించేవాడినని చెప్పాడు. అయితే ప్రస్తుతం తామిద్దరం మంచి స్నేహితులమని కూడా చెప్పాడు. తనతో మైత్రి ఏర్పర్చుకున్న క్రికెటరల్లో కొందరు మాత్రమే మనస్సున్న వాళ్లు వున్నారని, వారిలో ఒకరు హెడెన్ అని అక్తర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Shoaib Akhtar  Rawalpindi express  Matthew Hayden  cricket  

Other Articles