Sourav Ganguly Ignores MS Dhoni in Fantasy Team ధోనికి స్థానం కల్పించని టీమిండియా మాజీ కెప్టెన్

No place for ms dhoni in sourav ganguly s ipl fantasy team

rising pune supergiant,delhi daredevils,mahendra singh dhoni,sourav ganguly,rishabh rajendra pant,indian premier league 2017, cricket, ipl 10, ipl 2017, Indian Premier League

Sourav Ganguly is known to be a hard taskmaster and he has shown that once again as he decided to leave MS Dhoni out of his playing XI for the IPL Fantasy League

ధోనికి స్థానం కల్పించని టీమిండియా మాజీ కెప్టెన్

Posted: 04/27/2017 07:50 PM IST
No place for ms dhoni in sourav ganguly s ipl fantasy team

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటతీరును ప్రశంసిస్తూ.. ప్రపంచ దిగ్గజ క్రికెటర్లు అతన్ని ది బెస్ట్ ఫినిషర్ అని పేర్కొంటున్న విషయం తెలిసిందే. అతని అధ్వర్యంలో భారత్ మూడు ప్రతిష్మాత్మకమైన విశ్వకప్ లతో పాటు ఛాంపియన్స్ ట్రాఫీలను అందుకున్న విజయాలను నెమరువేసుకోవడం అందరికీ తెలిసిందే. అయితే మనవాళ్లకు మనోడే పగోడన్న సినిమా డైలాగ్ ను నిజం చేస్తూ.. ధోని ప్రతిభను ప్రపంచమంతా కోడై కూస్తున్నా.. మన మాజీ కెప్టెన్లు మాత్రం ఆయనంటే కంటిగింపుగా పేర్కోంటున్నారు. అతను విజయాలను అందించినంతకాలం మౌనంగా వుండి.. కొద్దిగా ఫామ్ కొల్పోయిన తరుణంలో ఆయనను టార్గెట్ చేస్తున్నారు.

నిన్న ధోని బెస్ట్ పినిషర్ అన్న అంశంపై గౌతమ్ గంభీర్ స్పందించి అటలో బెస్ట్ బిగినర్, బెస్ట్ ఫినిషర్ అంటూ వుండరని, కేవలం బెస్ట్ క్రికెటర్ లు మాత్రమే వుంటారని కొత్త నిర్వచనం చెప్పిన 24 గంటల వ్యవధిలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగలీ కూడా ధోనిని చిన్నచూపు చూశాడు. తన డ్రీమ్ ఐపీఎల్ టీమ్ లో ధోనికి దాదా స్థానం కల్పించకపోవడమే ఇందుకు కారణం. ధోనీ స్థానంలో రిషబ్ పంత్ ను వికెట్ కీపర్ గా ఎంచుకున్న గంగూలీపై ధోని అభిమానుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా బాహాటంగా తమ అభిప్రాయాలను వెల్లడించిన క్రికెటర్లకు అటు క్యాబ్ లో ఇటు బిసిసిఐలో పలు పదవులను అప్పగించడం సమంజసం కాదని అన్నారు.

క్రికెట్ దేవుడిగా పేరోందిన సచిన్ టెండుల్కర్ లాంటి దిగ్గజాలు ఎంత హుందాగా వ్యవహరిస్తారో.. బిసిసిఐలో పలు పదవులను నిర్వహిస్తున్న వారు కూడా అలాగే వ్యవహరించాలని, లేని పక్షంలో వారిన పక్కకు తప్పించాలన్న డిమాండ్ కూడా తెరపైకి వస్తుంది. గంగూలీ ధోనిపై ఇలా స్పందించడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండవసారి. ఇటీవల టీ20లకు ధోనీ పనికిరాడంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తన డ్రీమ్ టీమ్ లో కూడా ధోనీని పక్కన పెట్టేశాడు. ఎంతో ఆలోచన, కొన్ని కష్టతరమైన నిర్ణయాల తర్వాత ఈ డ్రీమ్ టీమ్ ను రూపొందించానని గంగూలీ తెలిపాడు.

గంగూలీ ఐపీఎల్ డ్రీమ్ టీమ్ లో ఎవరున్నారంటే..

విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, స్టీవెన్ స్మిత్, ఏబీ డివిలియర్స్, నితీష్  రాణా, మనీష్ పాండే, రిషభ్‌ పంత్, సునీల్ నరైన్, అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్, క్రిస్ మోరిస్. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sourav ganguly  mahendra singh dhoni  ipl dream team  indian premier league  cricket  

Other Articles