Rishabh Pant, Rahul Tripathi shine in ipl-10 ఐపీఎల్ లో మెరిసిన మన కురాళ్లు వీరిద్దరే..

Rishabh pant rahul tripathi shine in ipl 10

rising pune supergiant, Tripathi helps win against KKR, Rahul Tripathi hits 93 runs, Rahul Tripathi misses maiden century, Rahul Tripathi, Rising Pune Supergiants beat Kolkata Knigh, rishabh rajendra pant, indian premier league 2017, cricket, ipl 10, ipl 2017, Indian Premier League

Rishabh Pant, Rahul Tripathi shines in ipl-10, pant who is basically a wicketkeeper and batsman proved himself as an alternative to MS Dhoni, while tripathi the maharastra batsman shines with bat in ipl-10

ఐపీఎల్ లో మెరిసిన మన కురాళ్లు వీరిద్దరే..

Posted: 05/04/2017 06:19 PM IST
Rishabh pant rahul tripathi shine in ipl 10

ఐపీఎల్ సీజన్-10లో విదేశీ క్రికెటర్లకు ధీటుగా మెరిసిన మన దేశవాళీ క్రికెటర్లు ఇద్దరు మాత్రమే. ఒకరు మహారాష్ట్రకు చెందిన బ్యాట్స్ మెన్ రాహుల్ త్రిపాఠి కాగా మరోకరు జూనియర్ జట్టు సభ్యుడైన రిషబ్ పంత్. అనూహ్యంగా ఐపీఎల్ లో స్థానం సంపాదించిన రాహుల్ త్రిపాఠి అందరి అంచనాలను తోసిరాజుతూ తనదైన శైలిలో బ్యాట్ ను ఝుళిపిస్తున్నాడు. కాగా, రిషబ్ పంత్ ధోనీ వారసుడిగా ఆశలు రేకెత్తిస్తున్నాడు. జార్ఖాండ్ రాష్ట్రానికి చెందినవాడు మాత్రమే కాకుండా....కీపింగ్, బ్యాంటింగ్ లో ధోనీకి సరితూగే ఆటగాడని విశ్లేషకులు ప్రశంసలు పొందుతున్నాడు.

ఇక రాహుల్ త్రిపాఠి ఐపీఎల్ లో పూణే సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసినంతవరకు పెద్దగా ఎవరికీ తెలియని ఆటగాడు. పూణే ఆడిన మ్యాచ్ లలో చివర్లో బ్యాటింగ్ కు దిగిన రాహుల్ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో రాహుల్ పై కెప్టెన్ స్మిత్ నమ్మకముంచాడు. దీంతో ఓపెనర్ గా రహానేకు జోడీగా రాహుల్ ను దించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చెయ్యని రాహుల్ త్రిపాఠి... అంచనాలకు ధీటుగా రాణిస్తున్నాడు.

అయితే తన కెరీర్ లోనే తొలి సెంచరీని కేవలం 7 పరుగుల దూరంలో కొల్పోయిన రాహుల్ త్రిఫాఠిని దేశవాళీ క్రికెటర్లతో పాటు టీమిండియా క్రికెటర్లు కూడా కోనియాడుతున్నారు. కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి సత్తాచాటాడు. కలకత్తా నైట్ రైడర్స్ తో క్రితం రోజున జరిగిన మ్యాచ్ లో 93 పురుగుల వద్ద అవుటై సెంచరీ మిస్సయ్యాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ సిరీస్ లో భారత జట్టుకు దొరికిన ఆణిముత్యాలుగా క్రీడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Tripathi  ipl-10  rishabh rajendra pant  indian premier league  cricket  

Other Articles