will angry BCCI pull out of ICC Champions Trophy ఛాంపియన్స్‌ ట్రోఫీని బహిష్కరించే యోచలో బిసిసిఐ

Routed in icc vote bcci may seek champions trophy pullout

Champions Trophy, Shashank Manohar, Indian cricket team, ICC, BCCI, ICC New Revenue Model, Amitabh Choudhary

The prospect of India pulling out of this year's Champions Trophy loomed large after the BCCI was left isolated in its opposition to proposed reforms to the way the game is run globally.

ఛాంపియన్స్‌ ట్రోఫీని బహిష్కరించే యోచలో బిసిసిఐ

Posted: 04/27/2017 06:04 PM IST
Routed in icc vote bcci may seek champions trophy pullout

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మెన్ గా భారతీయుడైన శశాంక మనోహర్ కొనసాగుతున్నా.. బిసిసిఐ మాత్రం ఐసీసీ అధ్వర్యంలో నిర్వహించనున్న ఛాంఫియర్స్ ట్రాపీని బహిష్కరించాలన్న యోచనలో వుంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. మూడేళ్ల కిందట ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ బోర్డుల సహకారంతో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, అప్పటి ఐసీసీ ఛైర్మన్‌ శ్రీనివాసన్‌ ప్రవేశ పెట్టిన ‘బిగ్‌-3’ ఆదాయ పంపిణీ విధానానికి ప్రస్తుత చైర్మన్ శశాంక్ మనోహర్ ముగింపు పలకడమే. దీంతో బిగ్ 3 ద్వారా బిసిసిఐకి ఐసిసి నుంచి లభించే రాబడి కాస్తా హరించుకుపోవడంతో.. బిసిసిఐ ఈ మేరకు యోచిస్తుంది.

ఛాంపియన్స్ ట్రోఫీని బహిష్కరించడం వల్ల బిసిసిఐకి కలిగే లాభమేంటి అంటారా..? భారత్‌ ఆడలేదంటే ఛాంపియన్స్‌ ట్రోఫీనే కళతప్పడం, ఆదాయంలో భారీగా గండిపడటం ఖాయం. మున్ముందు కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తే ఐసీసీకి కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తవచ్చు. అయితే ఇప్పటికే ఈ విషయాన్ని గ్రహించిన ఐసిసి భారత్ కు అదనంగా 650 కోట్ల రూపాయలను అందిస్తామని కూడా ప్రతిపాదన చేశారు. అయితే అందుకు బిసిసిఐ మాత్రం అంగీకారం చెప్పలేదు. మరి ఇప్పటికైనా ఐసిసి బిసిసిఐను దారికి తెచ్చుకునేలా చర్యలు తీసుకుంటుందా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్టును ప్రకటించాయి. అయితే ఐసిసి రగిల్చిన మంటతో మంచి కాకమీదున్న బిసిసిఐ మాత్రం ఇప్పటివరకు ఛాంపియన్ ట్రోఫీకి తమ జట్టును ప్రకటించలేదు. అయితే ఇందుకోసం ఐసిసి నిర్దేశించిన తుదిగడువు కూడా ముగిసిపోయింది. కానీ భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం వేచిచూసే ధోరణినే అవలంబించనుంది. దీంతో బిసిసిఐ తమకు రానున్న అదాయ వనురులను రాబట్టుకునేందుకు ఐసీసీపై ఒత్తిడిని, ప్రయత్నాలను తీవ్రతరం చేసేందుకు ఎత్తుగడ వేసింది. బిసిసిఐ ఎత్తుగడలపై ఇప్పటివరకు ఐసీసీ పట్టించుకోలేదు. మరి టోర్నీకి జట్టునే పంపకపోవడం ద్వారా భారత్‌ తన నిరసనను తెలియజేస్తుందేమో చూడాలి.

ఈ టోర్నీకి ఇంతవరకూ భారత జట్టును బీసీసీఐ ప్రకటించలేదన్న సంగతి తెలిసిందే. ఇక ఇండియా లేకుంటే, ట్రోఫీ కళతప్పడంతో పాటు, ఐసీసీ ఆదాయానికి భారీగా గండిపడుతుంది. ఆపై ఐసీసీ నిర్వహించే టోర్నీలకు బీసీసీఐ మద్దతు పలకకుంటే, క్రికెట్ ఆడే దేశాలన్నీ నష్టపోతాయి. ఇప్పటివరకూ బీసీసీఐ నుంచి టోర్నీ బహిష్కరణపై ఎటువంటి అధికారిక సమాచారం రాకున్నా, తన మాటను నెగ్గించుకునే దిశగా అధికారులు ఏ చర్యలు తీసుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles