అంగరంగ వైభవంగా ఐపీఎల్-10 ప్రారంభోత్సవం.. IPL 2017 gets underway with drab opening ceremony in Hyderabad

Ipl 2017 gets underway with drab opening ceremony in hyderabad

IPL opening ceremony 2017 live,ipl 10 opening ceremony live,opening ceremony of ipl 2017 live, sony six live streaming,ipl opening ceremony 2017 live, sony max live, IPL 2017,IPL 10,Indian Premier League,Opening Ceremony,Sachin Tendulkar,Sourav Ganguly,Rahul Dravid,VVS Laxman,Virender Sehwag,Sunrisers Hyderabad,Royal Challengers Bangalore,IPL Twenty 20, cricket

The Indian Premier League 2017 got underway in Hyderabad but the opening ceremony would have left the spectators thoroughly disappointed.

అంగరంగ వైభవంగా ఐపీఎల్-10 ప్రారంభోత్సవం..

Posted: 04/05/2017 08:39 PM IST
Ipl 2017 gets underway with drab opening ceremony in hyderabad

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 10వ సీజన్ ఇవాళ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గతానికి భిన్నంగా దేశవ్యాప్తంగా ఎన్నిమిది జట్టు ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టణాలలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించిన బిసిసిఐ. అయితే అన్నింటా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మాత్రం అధికారికంగా ప్రారంభించింది. హైదరాబాద్ స్టేడియంలో ఐపీఎల్ - 10వ సీజన్ ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అభిమానుల సందడి మధ్య సంబరాలు అంబరాన్ని తాకాయి.

కాగా మాజీ టీమిండియా కెప్టెన్ రవిశాస్త్రీ వ్యాఖ్యతగా వ్వవహరిస్తూ.. క్రికెట్ దిగ్గజాలను వేదికపైకి అహ్వానించడంతో ప్రారంభోత్సవాలు ప్రారంభమయ్యాయి. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ లను స్టేడియంలోకి ఆహ్వానిస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో మైదానంలో తిరుగుతూ, అభిమానులను వారు ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా సచిన్, గంగూలీ, సెహ్వాగ్, లక్ష్మణ్ లను బీసీసీఐ సత్కరించి జ్ఞాపికలు అందజేసింది.

అనంతరం, మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల మధ్య బాలీవుడ్ నటి అమీ జాక్సన్ ఓపెన్ టాప్ వాహనంలో స్టేడియంలోకి అడుగుపెట్టింది. కాలాచష్మా, దమ్మాదమ్మా పాటలకు తన బృందంతో డ్యాన్స్ చేసి ఉర్రూతలూగించింది.  ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు, ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రత్యేకంగా రూపొందించిన లేజర్  షో ద్వారా ఈ లీగ్ గొప్పతనాన్ని ప్రదర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags :

Other Articles