బీసిసిఐపై అసంతృప్తి వెల్లగక్కిన విరాట్ కోహ్లీ Virat Kohli Unhappy With BCCI's Pay Hike, Demands More

Virat kohli unhappy with bcci s pay hike demands more

virat kohli, kohli, kohli vs australia, india vs australia, ind vs aus, bcci, bcci awards, india, Pay Hike, BCCI, indian premier league 2017, india cricket, cricket india, cricket news, cricket, sports news, sports

India captain Virat Kohli is not pleased with the BCCI pay hike and wants Indian cricketers to earn more than what they are getting at the moment.

బీసిసిఐపై అసంతృప్తి వెల్లగక్కిన విరాట్ కోహ్లీ

Posted: 04/05/2017 07:05 PM IST
Virat kohli unhappy with bcci s pay hike demands more

అస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్ లో వీరవిహారం చేసి.. 21తో నెగ్గిన టీమిండియాకు బిసిసిఐ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ నజరానా పై కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యాటర్ లోకి ఎంటైర్ అయితే.. గత నెలలో టీమిండియా క్రికెట్ ఆటగాళ్ల వేతనాలను రెట్టింపు చేస్తూ, మూడు విభాగాల్లో ఆటగాళ్లను వర్గీకరిస్తూ, రూ. 2 కోట్లు, రూ. 1 కోటి, రూ. 50 లక్షలు ఇచ్చేలా బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై విరాటుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు.

టీమిండియా ఆటగాళ్లు పోందుతున్న ఫీజులను విదేశీ ఆటగాళ్ల ఫీజులతో పోలిస్తే, ఏ మూలకు సరిపోవడం లేదని అన్నారు. బీసిసిఐ ఇస్తున్న ఫీజులు చాలా తక్కువని, ఈ విషయంలో తమకు అసంతృప్తి ఉందని అన్నాడు. టెస్టు మ్యాచ్ కి రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ-20కి రూ. 3 లక్షలు ఇచ్చేలా పాత ఫీజులను పెంచుతూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయమూ తృప్తిగా లేదని అన్నాడు. భారత జట్టు మాజీ మేనేజర్ రవిశాస్త్రి ఈ విషయమై స్పందిస్తూ.. ఆటగాళ్లకు వేరుసెనగ పప్పులు ఇచ్చినట్లు బీసిసిఐ వేతనాలు ఇస్తుందని విమర్శించారు.

ఆ మరుసటి రోజునే కోహ్లీ ఈ విషయమై స్పందిస్తూ.. తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా క్రికెటర్లు సాలీనా రూ. 10 నుంచి రూ. 12 కోట్లు సంపాదిస్తున్నారని, ఆయా దేశాల క్రికెట్ బోర్డులతో పోలిస్తే, బలంగా ఉన్న బీసీసీఐ, అందులో సగం కూడా ఇవ్వడం లేదని వాపోయాడు. ఏ గ్రేడ్ ఆటగాడికి రూ. 5 కోట్లు, బీ గ్రేడ్ లో రూ. 3 కోట్లు, సీ గ్రేడ్ లో రూ. 1.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కోహ్లీ అభిప్రాయాలతో కోచ్ అనిల్ కుంబ్లే సైతం ఏకీభవించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  virat kohli  Pay Hike  BCCI  indian premier league 2017  cricket  

Other Articles