ఐపీఎల్ లో పగ్గాలు లేకుండా తొలిసారిగా.. MS Dhoni All Set for His Maiden IPL Bow as Non-captain

Ms dhoni all set for his maiden ipl bow as non captain

Dhoni, IPL 10, IPL 2017, MCA Stadium, Mahendra Singh Dhoni, Indian cricket, greatest skipper, non-captain, MS Dhoni, Mumbai Indians, Rising Pune Supergiant, Smith, Steven smith

Arguably the greatest skipper in the history of Indian cricket, Mahendra Singh Dhoni is set to make his IPL debut as a non-captain in Rising Pune Supergiants.

ఐపీఎల్ లో పగ్గాలు లేకుండా తొలిసారిగా..

Posted: 04/06/2017 06:42 PM IST
Ms dhoni all set for his maiden ipl bow as non captain

నిర్వివాదంగా టీమిండియా అత్యద్బుత కెప్టెన్లలో అగ్రస్థానాన్ని అక్రమించి మేటి సారధిగా పేరొందిన మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా తరువాత.. ప్రస్తుతం ఐపీఎల్ లో కూడా తొలిసారిగా కెప్టెన్సీ పగ్గాలను లేకుండా బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఎన్నిమిది పర్యాయాల వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారధ్య బాధ్యతలను నిర్వహించిన ధోని.. ఆ తరువాత గతేడాది పూణే జట్టు బాధ్యతలను తనపై వేసుకున్నాడు. కాగా ఈ సారి కెప్టెన్సీ పగ్గాలు లేకుండానే బరిలోకి దిగుతున్నాడు.

ఐపీఎల్ సీజీన్ ప్రారంభం నుంచి చెన్నై కెప్టెన్ గా వున్న ధోని గత రెండేళ్ల క్రితం ఆ జట్టు రద్దు కావడం, ధోనీ పుణె జట్టుకు వెళ్లడం తెలిసిందే. అయితే.. ముంబై ఇండియన్స్ జట్టుకు, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టుకు మధ్య పుణె ఎంసీఏ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్‌గా కాకుండా కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ పగ్గాలను ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌కు అప్పగించాలని ఆర్‌పీఎస్ యాజమాన్యం తీవ్రమైన నిర్ణయం తీసుకుంది.

ధోని తమతో సరిగా వ్యవహరించలేదని, ఆయన జట్టు విషయాల్లో కూడా తమతో ఎలాంటి చర్చలు నిర్వహించలేదని, అతని వ్యవహరతీరు కూడా తమతో కొంత భిన్నంగా వున్నందనే జట్టు ప్రయోజనాల కోసం తాము దోనిని కెప్టెన్సీ నుంచి తప్పించామని జట్టు యాజమాన్యం ఇదివరకే ప్రకటించింది. దీంతో సుమారు దశాబ్దం తర్వాత ఐపీఎల్‌లో కెప్టెన్సీ లేకుండా ధోనీ బరిలోకి దిగుతున్నాడు. జట్టు ప్రయోజనాల కోసమే స్మిత్‌కు పగ్గాలు అప్పగించినట్లు పుణె జట్టు యజమాని సంజీవ్ గోయెంకా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhoni  IPL 10  IPL 2017  MCA Stadium  MS Dhoni  Mumbai Indians  Rising Pune Supergiant  Smith  Steven smith  

Other Articles