శశాంక్ మనోహర్ ను పోమ్మనకుండా పోగబెట్టారా..? Reasons behind Shashank Manohar step down as ICC chairman

Reasons behind shashank manohar step down as icc chairman

Shashank Manohar, International cricket council, ICC CEO, ICC, Dave Richardson, BCCI, Shashank Manohar resignation, cricket

In a surprise development, Shashank Manohar today resigned as ICC chairman after merely eight months in office citing personal reasons.

శశాంక్ మనోహర్ ను పోమ్మనకుండా పోగబెట్టారా..?

Posted: 03/15/2017 08:49 PM IST
Reasons behind shashank manohar step down as icc chairman

టీమిండియా క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్ష బాధ్యతల నుంచి అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎంపికై వెళ్లిన భారతీయుడు శశాంక్ మనోహర్.. తన పదవికి రాజీనామా చేస్తూ క్రీడాభిమానులను షాక్ కు గురిచేశారు. శశాంక్ మనోహర్ తీసుకున్న అకస్మిక  నిర్ణయానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే ఆయన ఇవాళ ఉదయం ఈ మేరకు ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచార్జ్ సన్ కు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను పంపించారు.

వ్యక్తిగత కారణాలతో తాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ఆయన పేర్కోన్నారు. అయితే ఆయనకు బీసిసిఐకు ఆయనకు మధ్య కొంత కాలంగా అభిప్రాయబేధాలు పోడచూపాయని దాంతోనే ఆయన రాజీనామా చేశారని క్రీడావర్గాలు నుంచి సమాచారం. దీనికి తోడు ఆయన ఐసీసీలో తీసుకుంటున్న అధికార వికేంద్రకరణ చర్యలపై కూడా దేశీయ జట్ట నుంచి మద్దతు లభించని నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏఢాది మే నెల వరకు చైర్మన్ గా కొనసాగే అవకాశం వున్నా.. అయన తన పదవిని వదులుకున్నారు. అయితే దీనిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక మరికోన్ని వర్గాలు మాత్రం కొన్ని దేశీయ బోర్డుల వద్ద వున్న అధికారాన్ని అన్ని దేశాలకు సమానంగా పంచాలని, అధికార వికేంద్రీకరణ జరగాలన్న దిశగా ఆయన చర్యలకు పూనుకున్నారు. మరీ ముఖ్యంగా క్రికెట్ లో ది బిగ్ త్రి అని పిలవబడే.. క్రికెట్ అస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులతో పాటు భారత క్రికెట్ బోర్డుల వద్ద మాత్రమే అధికారం వుంటూ వస్తున్న నేపథ్యంలో దానిని అంతర్జాతీయ క్రికెట్ మండలిలో పలు మార్పులను చేసేందుకు ఆయన యత్నించారని.. అయితే ఇది సాధ్యపడాలంటే ఐఃసీసీలో రెండింత మూడొంతల మెజారిటీని సాధించాల్సి వుంది. కాగా బంగ్లాదేశ్, జింబాబ్వే, శ్రీలంక మద్దతు మాత్రమే కూడగట్టుకున్న ఆయన మరిన్ని దేశాల క్రికెట్ బోర్డులను కూడగట్టుకోవడంలో విఫలమయ్యారు.

ఇక ఈ నేపథ్యంలో ఆయనపై బిసిసిఐ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసిందని.. ఆయన చర్యలు తమకు అవరోధంగా మారుతున్నాయని బిసిసిఐ అయనపై తీవ్రస్థాయిలో మండిపడిందని.. దాంతోనే ఆయన రాజీనామా చేశారని తెలుస్తుంది. తాను సంకల్పించిన మార్పులకు దేశాల మద్దతు కూడగట్టుకోలేకపోవడంతో విఫలం కావడంతో పాటు స్వదేశీ క్రకెట్ బోర్డుతో అనవసర తలనొప్పులు ఎందుకని,   మనోవేదన చెందిన శశాంక్ మనోహర్ తన పదవికి రాజీనామా చేశారని పేర్కోంటున్నాయి.

58ఏళ్ల వయస్సుగల శశాంక్ మనోహర్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ పదవిని చేపట్టిన 8 నెలల వ్యవధిలోనే తన పదవికి రాజీనామా చేయడం పలు వర్గాలను అశ్చర్యపర్చింది. బీసీసీఐ అధ్య‌క్షుడిగా ఆయ‌న‌ గతంలో రెండు సార్లు పని చేశారు. గ‌త ఏడాది మేలో ఐసీసీ చైర్మన్‌ పదవికి ఏక‌గ్రీవంగా ఎన్నికై ఈ పదవి చేపట్టారు. దీంతో తొలి ఇండిపెండెంట్‌ చైర్మన్‌గా కూడా ఆయ‌నే నిలిచారు. ఆయ‌న ప‌ద‌వీ కాలం వ‌చ్చేనెల మే వ‌ర‌కు ఉంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల వ‌ల్లే రాజీనామా చేస్తున్నాన‌ని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh