రాంచీ టెస్టులో విరాట్ సేనపైనే తీవ్ర ఒత్తిడి.. Pressure's Right on India,' Says Nathan Lyon

Pressure s right on india says nathan lyon ahead of ranchi test

india vs australia, nathan lyonm steve smith, virat kohli, australia, india, test series, sports, cricket

Australia's leading spinner Nathan Lyon said the “pressure is right on India” in the ongoing four-match Test series and patted his team for its fighting display.

రాంచీ టెస్టులో విరాట్ సేనపైనే తీవ్ర ఒత్తిడి..

Posted: 03/14/2017 09:52 PM IST
Pressure s right on india says nathan lyon ahead of ranchi test

జార్ఖండ్ వేదికగా రాంచీ మైదానంలో ఈ నెల 16 నుంచి భారత్ అస్ట్రేలియా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియాపైనే అధిక ఒత్తిడి వుందని అస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్ లో ఆసీస్ ఎటువంటి ఒత్తిడి లేకుండానే బరిలోకి దిగిందనే విషయం విరాట్ సేనకు తెలుసన్నాడు. ఈ క్రమంలో సిరీస్ ను గెలవాలన్న ఒత్తిడి తమకన్నా విరాట్ సేనపైనే విపరీతంగా ఉందన్నాడు.

'భారత్ తో సిరీస్ లో భాగంగా మేము దుబాయ్ లో అడుగుపెట్టినప్పుడు అపారమైన నమ్మకంతో ఉన్నాం. కానీ భారత్ కు వచ్చిన తరువాత సిరీస్ ను 4-0 తో కోల్పోతున్నామనే వార్తలు వచ్చాయి. ప్రతీ ఒక్కరు కూడా మాతో అదే చెబుతూ వచ్చారు. మా జట్టు భారత్ పై విజయం సాధించడం అంత ఈజీ కాదన్నారు. మా జట్టులో కీలక అటగాళ్లు లేకపోవడం.. జట్టు కొంత బలహీనంగా వుందని కూడా చెప్పారు.

మమ్మల్ని ఇంకా నేర్చుకునే జట్టుగానే అభివర్ణించారు. కాకపోతే ప్రపంచంలో ఎంత అత్యుత్తమ జట్టుపైనైనా గెలుపొందే సత్తా ఆస్ట్రేలియాకు ఉంది. అదే తొలి టెస్టులో నిరూపించాం కూడా.రెండో టెస్టులో ఓడటం కొద్దిగా బాధించింది. మూడో టెస్టులో తిరిగి సత్తా చాటుతాం. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో భారత్ పైనే తీవ్ర ఒత్తిడి ఉంది.. మాపై ఎంతమాత్రం కాదు' అని లియాన్ తెలిపాడు. అయితే మూడో టెస్టుతో గెలుపు ఎవరిని వరిస్తుంది.. ఎవరిపైన ఒత్తిడి నెలకొందన్న విషయం త్వరలోనే తేలనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  nathan lyonm steve smith  virat kohli  australia  india  test series  sports  cricket  

Other Articles

Today on Telugu Wishesh