టెస్టుల్లో నాలుగేళ్ల తరువాత తొలి శతకం.. Glenn Maxwell hits maiden Test century

Glenn maxwell hits maiden test century four years after debut

glenn maxwell, maxwell, maxwell century, india vs australia, ind vs aus 2017, ind vs aus 3rd test, india vs australia 3rd test, cricket news, cricket

Glenn Maxwell scored his maiden Test hundred on day two of the third Test between India and Australia, who had a meager debut against the same opponents in 2013

టెస్టుల్లో నాలుగేళ్ల తరువాత తొలి శతకం..

Posted: 03/17/2017 08:28 PM IST
Glenn maxwell hits maiden test century four years after debut

టెస్టు క్రికెట్ లో భారత్ తో జరిగిన మ్యాచ్ లోనే అరంగ్రేటం చేసిన అస్ట్రేలియా క్రికెటర్ మాక్స్ వెల్.. ఇవాళ రాంచీ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో తొలి శతకాన్ని కూడా నమోదు చేశాడు. రెండో టెస్టులో మిచెల్ మార్ష్ అర్ధాంతరంగా గాయపడటంతో మూడో టెస్టు తుది జట్టులో స్థానం దక్కించుకున్న మ్యాక్స్ వెల్ తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో శతకంతో రాణించి ఆసీస్ యాజమాన్యం పెట్టుకున్న ఆశల్ని నిజం చేశాడు.

గతంలో టెస్టు అరంగేట్రం చేసిన జట్టుపైనే మ్యాక్స్ వెల్ తాజాగా తొలి శతకం సాధించడం విశేషం. 2013లో భారత్ పై హైదరాబాద్ లో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఈ ఫార్మాట్ లో మ్యాక్స్ వెల్ అరంగేట్రం చేశాడు. ఆ తరువాత ఇంతకాలానికి అదే జట్టుపై తొలి శతకం సాధించాడు. అటు మ్యాక్స్ వెల్ టెస్టు అరంగేట్రం..ఇటు ఆ ఫార్మాట్ లో తొలి శతకం భారత్ లోనే రావడం ఇక్కడ మరో విశేషం. ఇది మ్యాక్స్ వెల్ కెరీర్ లో నాల్గో టెస్టు మ్యాచ్. దీనికి ముందు టెస్టుల్లో మ్యాక్స్ వెల్ అత్యధిక స్కోరు 37.

మూడో టెస్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్ తో కలిసి 191 పరుగుల భాగస్వామ్యాన్ని మ్యాక్ప్ వెల్ జత చేశాడు. ఈ క్రమంలోనే  185 బంతుల్లో 9 ఫోర్లు, 2సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. అనంతంర జడేజా బౌలింగ్ లో మ్యాక్స్ వెల్  పెవిలియన్ చేరాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : glenn maxwell  maxwell century  india vs australia  ranchi test  umesh yadav  cricket  

Other Articles