బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా India Thrash Bangladesh by 64 runs in Women's Asia Cup

Women s asia cup 2016 india thrash bangladesh by 64 runs

Anuja Patil, asia cup t20, India Beat Bangladesh, Indian Eves Win, jhulan goswami, poonam yadav, Women's Asia Cup 2016, indian women cricket, bangladesh women cricket, asia cup, cricket, cricket news, sports, sports news

India defeated Bangladesh by 64 runs in the opening match of the Asian Cricket Council (ACC) women's Twenty-20 Asia Cup at the Asian Institute of Technology ground

బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా

Posted: 11/26/2016 06:48 PM IST
Women s asia cup 2016 india thrash bangladesh by 64 runs

ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన ఆరంభపు ట్వంటీ 20 మ్యాచ్లో భారత మహిళలు చెలరేగిపోయారు. బంగ్లాదేశ్ మహిళల్ని 54 పరుగులకే కూల్చేసి 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. టాస్ ఓడి తొలుత  బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.భారత క్రీడాకారిణుల్లో  మిథాలీ రాజ్(49) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోగా, స్మృతీ మందనా(41) ఆకట్టుకుంది. ఈ జోడి తొలి వికెట్కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి భారత్ ను పటిష్ట స్థితికి తీసుకెళ్లింది. కాగా, ఆ తరువాత హర్మన్ ప్రీత్ కౌర్(19) మినహా ఎవరూ రాణించకపోవడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరుకే పరిమితమైంది.

అయితే ఆపై 119 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ 13 పరుగుకే మూడు వికెట్లను నష్టపోయి  కష్టాల్లో పడింది.కాగా, సల్మా ఖాతున్(17), షాలియా షర్మిన్(18) మోస్తరుగా ఫర్వాలేదనిపించడంతో బంగ్లాదేశ్ 50 పరుగుల మార్కును దాటింది. వీరిద్దరూ అవుటైన తరువాత బంగ్లా కథ మళ్లీ మొదటికొచ్చింది. కనీసం క్రీజ్లో నిలుచునే ప్రయత్నం చేయకుండానే బంగ్లా క్రీడాకారిణులు క్యూకట్టేశారు. భారత మహిళల్లో పూనమ్ యాదవ్ మూడు వికెట్లు, గోస్వామి, అనుజా పాటిల్ తలో రెండు వికెట్లు సాధించారు. మన్షీ జోషి, ఏక్తా బిస్త్లకు చెరో వికెట్ దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles