మొహాలీ టెస్టు: తొలిరోజు అటలో టీమిండియా పైచేయి India hold advantage after England throw theirs away

Bairstow shines but india take charge against careless england

india vs england, ICC, virat kohli, alastait cook, mohali test, ashwin, jadeja ind vs england, ind vs eng, india vs england third test, india vs england mohali test, india vs england alastair cook, ind vs eng cook, cricket news, sports news

India bowlers nullify England's advantage of winning the toss by reducing them to 268/8 at stumps on Day 1 of the third Test.

మొహాలీ టెస్టు: తొలిరోజు అటలో టీమిండియా పైచేయి

Posted: 11/26/2016 07:56 PM IST
Bairstow shines but india take charge against careless england

పర్యాటక జట్టు ఇంగ్లాండ్ తో మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. ఇవాళ ప్రారంభమైన టెస్టులో తొలిరోజున పర్యాటక జట్టుపై టీమిండియా అద్యంతం పైచేయి సాధించింది. ఫలితంగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్ జట్టులో బెయిర్ స్టో, బట్లర్ రాణించడంతో దౌరవప్రదమైన స్కోరును సాధించారు. వీరిద్దరు మినహా పర్యాటక జట్టులో మిగతా అటగాళ్లు భారత బౌలర్ల ధాటికి వెనుదిరగాల్సి వచ్చింది.

 పేసర్లకు అనుకూలించే పిచ్ పై స్పిన్నర్లు కూడా రాణించడంతో తొలిరోజు ఆటలో టీమిండియాదే పైచేయిగా నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు ఆదిలో తడబడింది. ఓపెనర్ హమీద్ (9) విఫలమయ్యాడు, అనంతరం వచ్చిన జో రూట్ (15) కూడా ఆకట్టుకోలేకపోయాడు. వరుసగా రెండు వికెట్లు పడడంతో తడబడ్డ ఓపెనర్, కెప్టన్ కుక్ (27) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో నిలదొక్కుకున్నాడు. అనంతరం వచ్చిన మొయిన్ అలీ (16) విఫలమయ్యాడు.

దీంతో బెన్ స్టోక్స్ (29) కూడా స్ట్రోక్స్ ఆడలేక పెవిలియన్ చేరాడు. జోస్ బట్లర్ (43) నిలదొక్కుకోవడంతో బెయిర్ స్టో (89) ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. ఈ ఇద్దరూ భారీ స్కోరు దిశగా సాగుతున్న దశలో మరోసారి జట్టు కుదుపుకులోనైంది. వీరిద్దరూ ఔటవడంతో వోక్స్ (25) ఏకాగ్రత చెదిరి పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులో రషీద్ (4), బెట్టీ (0) క్రీజులో ఉన్నారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్ చెరి రెండు వికెట్లతో ఆకట్టుకోగా, అశ్విన్, షమి చెరో వికెట్ తీసి వారికి సహకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  virat kohli  alastait cook  mohali test  ashwin  jadeja cricket  

Other Articles