బిసిసిఐకి మొట్టికాయలు వేసిన సుప్రీంకోర్టు BCCI unlikely to submit undertaking in Supreme Court

Bcci unlikely to submit undertaking in supreme court

bcci, justice lodha, lodha, lodha supreme court, sc, bcci vs lodha, bcci lodha panel hearing, bcci lodha supreme court, bcci reply justice lodha, sports, sports news

BCCI in its response to the Supreme Court said Lodha panel's recommendations were "rejected by voting" at the SGM.

బిసిసిఐకి మొట్టికాయలు వేసిన సుప్రీంకోర్టు

Posted: 10/06/2016 06:48 PM IST
Bcci unlikely to submit undertaking in supreme court

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. జస్టిస్ లోదా కమిటి ఇచ్చిన సిఫార్సుల అమలు విషయంలో బిసిసిఐ ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణిపై మరోసారి సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. బీసీసీఐలో ప్రక్షాళన తీసుకొచ్చేందుకు లోధా ప్యానెల్ ప్రతిపాదనలు సూచిస్తే వాటిని అమలు చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని సుప్రీం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

దీనిలో భాగంగా బీసీసీఐ అనుబంధ రాష్ట్ర అసోసియేషన్లకు రూ.400 కోట్ల రూపాయల్ని బదిలీ చేయడాన్ని సుప్రీం తప్పుబట్టింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో పారదర్శకత విధానం ఉన్నట్లయితే రాత్రికి రాత్రి ఆ నిధులను ఎలా బదిలీ చేస్తారంటూ ప్రశ్నించింది. అసలు బీసీసీఐలో ఉన్న వారి అర్హత ఏమిటో చెప్పాలంటూ జస్టిస్ ఠాకూర్ ప్రశ్నించారు.

జస్టిస్ ఆర్‌ఎం లోధా దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. దీనిలో భాగంగా ఇరు  పక్షాల వాదనలు వాడివేడిగా సాగుతున్నాయి. ఒకవైపు తమ ప్రతిపాదనల్ని అమలు చేయడంలో  లెక్కలేనితనం ప్రదర్శిస్తున్న బీసీసీఐలో అత్యున్నత పదవుల్లో ఉన్న వారిని తొలగించాలంటూ లోధా సుప్రీంను కోరింది.  మరోవైపు తాము లోధా కమిటీ మెయిల్స్ కు స్పందించలేదంటూ చెప్పడం సరికాదని బీసీసీఐ పేర్కొంది. కోర్టుకు సమర్పించాల్సిన 40 మెయిల్స్ ను లోధా ప్యానెల్ కు పంపినట్లు బీసీసీఐ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  supreme court  lodha committee  cricket  

Other Articles