అశ్విన్, జడేజా, షమీలకు విశ్రాంతి, యూవీకి చెయ్యి.. India's Raina recalled for New Zealand ODI series

India s raina recalled for new zealand odi series

suresh raina, raina, india vs new zealand, india vs new zealand odis, ind vs nzl odi series, indian squad, ms dhoni, suresh raina, yuvraj singh, Team India, raina india, ashwin, shami, jadeja, mandeep singh, ms dhoni, virat kolhi, cricket news, sports news

Ravichandran Ashwin, Ravindra Jadeja and Mohammed Shami have been rested for the ODI series against New Zealand.

అశ్విన్, జడేజా, షమీలకు విశ్రాంతి, యూవీకి మొండి చెయ్యి..

Posted: 10/06/2016 07:37 PM IST
India s raina recalled for new zealand odi series

భారత్ పర్యటనలో టెస్టు సిరీస్ అడుతున్న పర్యాటక జట్టు న్యూజీలాండ్ త్వరలో వన్డే సిరీస్ కూడా అడనున్న నేపథ్యంలో టీమిండియా వన్డే స్వాడ్ ను ఇవాళ బిసిసిఐ ప్రకటించింది. ఇప్పటికే టెస్టు సిరీస్ ను సొంత చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్ ను కూడా గెలుచుకుని న్యూజీలాండ్ పై పైచేయి సాధించాలని సంసిద్దమైంది. తెలుగువాడైన ఎమ్మెస్కే ప్రసాద్ ప్రధాన సెలక్టర్ గా నియమితులైన తరువాత ప్రకటించిన తొలి స్వాడ్ ఇది, ప్రసాద్ నేతృత్వంలోని కొత్త సెలక్షన్ కమిటీ తొలిసారి సమావేశమై 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది.

ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్టులో సీనియర్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు నిరాశ ఎదురైంది. అతడికి సెలెక్టర్లు మొండిచేయి చూపారు. న్యూజిలాండ్ తో జరగనున్న 3 వన్డేలకు భారత జట్టును గురువారం సాయంత్రం ప్రకటించారు. జయంత్ యాదవ్ కు కొత్తగా జట్టులో స్థానం దక్కింది. సురేశ్ రైనా, మన్ దీప్, కేదార్ జాదవ్, హార్థిక్ పాండ్యాలకు చోటు కల్పించారు. రవీంద్ర జడేజా, అశ్విన్, మహ్మద్ షమీకి విశ్రాంతినిచ్చారు. రాహుల్, ధావన్ ఇద్దరూ గాయాలతో ఉండటంతో వీరి పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు. ఇర్ఫాన్ పఠాన్, స్టువర్ట్ బిన్నీలకు కూడా నిరాశే ఎదురైంది.

వన్డే జట్టు
ఎంఎస్ ధోని(కెప్టెన్), విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, అజింక్య రహానే, మనీష్ పాండే, కేదార్ జాదవ్, హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, బుమ్రా, ఉమేశ్ యాదవ్, మన్ దీప్ సింగ్, ధవల్ కులకర్ణి, జయంత్ యాదవ్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ind vs nzl odi series  indian squad  ms dhoni  suresh raina  yuvraj singh  Team India  cricket  

Other Articles