ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడటం ఆయన స్టైల్.. Virat Kohli thanks MS Dhoni for decision making skills

Captaining india helped me play even better says virat kohli

virat kohli, mahendra singh dhoni, new zealand, Team India, virat kiohli, anil kumble, Test cricket, cricket, cricket news, India, India vs New Zealand 2016, sports news, sports

Virat Kohli thanked Mahrendra Singh Dhoni for inculcating the essence of being a leader, and training him about taking bold decisions and backing it to the hilt without thinking about consequences.

ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడటం ఆయన స్టైల్..

Posted: 10/06/2016 05:08 PM IST
Captaining india helped me play even better says virat kohli

ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి వుండటం ఆయన స్టైల్ అని.. టీమిండియా టెస్టు కెస్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. ఇంతకీ ఎవరాయన, ఆయన గురించి విరాట్ ఎందుకు మాట్లాడారు..? అనేగా మీ డౌట్. విరాట్ కోహ్లీ మాట్లాడింది మరెవరి కోసమే కాదు.. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోణి గురించి. ఆయన ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాడని చెప్పాడు. తాను కూడా ఆయన మార్గంలోనే పయనిస్తున్నానని చెప్పుకోచ్చాడు. అయితే చాలా ఆలోచించిన తరువాతే ఒక కచ్చితమైన నిర్ణయానికి రావాలంటున్నాడు. కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకునే ముందు సవాల్ ఎదురవుతుందని, ఆ సమయంలో తీసుకునే నిర్ణయానికి చాలా ధైర్యం కావాలని అభిప్రాయపడ్డాడు. అలా చేస్తేనే నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకుంటారని కోహ్లి పేర్కొన్నాడు.

మహేంద్ర సింగ్ ధోని తర్వాత భారత టెస్టు క్రికెట్ జట్టును సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న కోహ్లి.. నాయకత్వ లక్షణాలపై మాట్లాడాడు. 'నేను ధోని నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రస్తుతం నేను ధైర్యంగా వేసే అడుగులు ధోని నుంచి నేర్చుకున్నవే. నా కెప్టెన్సీ సక్సెస్కు ధోనినే కారణం.  ధోని ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనే దానిపై అతన్ని దగ్గర్నుంచి చూశా. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తరువాత అది తప్పైనా దానికే కట్టుబడి ఉండాలి. అయితే నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాల్సి వుంటుంది. కొన్ని సమయాల్లో స్వతహాగా నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమనిస్తుంది. అప్పుడు చాలా ధైర్యం కావాలి. మనం తీసుకునే నిర్ణయంలో సవాల్ ఎదురైతే దాన్ని సమర్ధవంతంగా స్వీకరించాలి. ఆ తరహా లక్షణాలే కెప్టెన్గా ఎదగడానికి దోహం చేస్తాయి'అని కోహ్లి తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  mahendra singh dhoni  new zealand  Team India  Test cricket  cricket  

Other Articles