ఫైనల్ టెస్టుకు భువి ఔట్.. శార్థూల్ థాకూర్ ఇన్ Injured Bhuvneshwar Kumar out of final New Zealand Test

Injured bhuvneshwar kumar out of final new zealand test

bhuvneshwar kumar, shardul thakur, india vs new zealand, india new zealand test series, shardul thakur news, bhuvneshwar kumar news, cricket, cricket news, latest sports news, bhuvneshwar kumar injury, kolkata test, indore test, eden gardens, Ishant Sharma, Holkar Cricket Stadium, chikungunya

India's medium-pacer Bhuvneshwar Kumar has been ruled out of the third and final Test against New Zealand due to a back strain with uncapped Shardul Thakur replacing him in Indore.

ఫైనల్ టెస్టుకు భువి ఔట్.. శార్థూల్ థాకూర్ ఇన్

Posted: 10/06/2016 04:15 PM IST
Injured bhuvneshwar kumar out of final new zealand test

ఈడెన్ గార్డెన్ లో టీమిండియాకు విజయాన్ని అందించడంలో కీలక భూమిక పోషించిన భారత ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇండోర్ లో జరగనున్నున్న మూడవ టెస్టుకు దూరమయ్యాడు. పర్యటక జట్టును ను మొదటి ఇన్నింగ్స్ లో కుప్పకూల్చి ఐదు విక్కెట్ల మార్కును నమోదు చేసుకున్న భువనేశ్వర్ కుమార్ కోల్ కతా లో ఈడెన్ గార్డెన్లో జరిగిన రెండో టెస్టులో గాయపడ్డాడు. దీంతో ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో తప్పని పరిస్థితులలో ఆయనను పక్కనబెట్టింది టీమిండియా.

ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తాజాగా వెలువరించిన ప్రకటనలో పేర్కోంది. భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే ఇషాంత్ శర్మ టెస్టు సిరీస్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఇషాంత్ కు చికెన్ గున్యా సోకడంతో సిరీస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు భువీ కూడా మూడో టెస్టుకు దూరం కావడంతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలన్న భావిస్తున్న భారత జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే సిరీస్ మాత్రం ఇప్పటికే ఇండియా వశం కావడంతో శార్థూల్ పై అంత ప్రభావం వుండకపోవచ్చు. కాగా భారత్ న్యూజీలాండ్ మధ్య చివరిదైన మూడో టెస్టు ఈనెల 8వ తేదీ నుంచి ఇండోర్ లో జరుగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhuvneshwar  Shardul Thakur  india  new zealand  BCCI  cricket  

Other Articles