ఐపీఎల్ ను లేపేయకపోతే ఇక చాలా కష్టం | BCCI thinks about scrapping of IPL 2017

Bcci thinks about scrapping of ipl

2017 IPL no, IPL RIP, BCCI thinks about scrapping of IPL, BCCI prior to Champions Trophy, BCCI shocking Decision, ICC vs BCCI

BCCI thinks about scrapping of IPL 2017 due to Champions Trophy.

ఐపీఎల్ ఇక ఉండబోదా?

Posted: 10/05/2016 09:59 AM IST
Bcci thinks about scrapping of ipl

ఇప్పటికే లోథా కమిటీ సిఫార్సులు, ఆపై సుప్రీం అక్షింతలతో స్వేచ్ఛను కోల్పోయామని గగ్గోలు పెడుతున్న బీసీసీఐ మరో షాకింగ్ నిర్ణయానికి సిద్ధపడినట్లు సమాచారం. కాసులు కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు ఉప్పందిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తో అనవసరంగా విభేధాలు కొనితెచ్చుకోవటం మంచిది కాదని భావిస్తున్న బోర్డు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే అది వచ్చే ఒక్క ఏడాదికి మాత్రమే సుమీ.

బీసీసీఐ మానసపుత్రిక ఐపీఎల్. భారత్ లో ఐపీఎల్ ఆరంభం తరువాత బీపీఎల్ (బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్), ఐటీపీఎల్ (ఇండియన్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్), ప్రొ కబడ్డీ లీగ్, ఐఎస్ఎల్ (ఫుట్ బాల్ ఛాంపియన్స్ లీగ్) ఇలా ఎన్నో లీగులు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటన్నింటికీ ఆది గురువు ఐపీఎల్. అలాంటి ఐపీఎల్ ను బీసీసీఐ రద్దు చేసుకోనున్నట్టు తెలుస్తోంది. లోథా కమిటీ సిఫారసుల నేపథ్యంలో ప్రతి టోర్నీకి మధ్య 15 రోజుల వ్యవధి ఉండాలి. అలా లేకపోవడంతో రెండు టోర్నీల్లో ఏదో ఒకదానిలో టీమిండియా పాల్గొనాల్సి ఉంది.

ఐతే ఛాంపియన్స్ లీగ్ కూడా బీసీసీఐ రూపకల్పన చేసినదే కావడం విశేషం. ఈ నేపధ్యంలో ఐసీసీ నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీని రద్దు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తో వివాదం ఏర్పడుతుంది. ఇప్పటికే ఐసీసీతో బీసీసీఐకి చిన్నచిన్న విభేదాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ కు విడుదల చేసిన నిధుల విషయంలో ఈ విభేదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీతో వివాదం కంటే దేశీ టోర్నీ అయిన ఐపీఎల్ ను రద్దు చేయడమే సరైన నిర్ణయమని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే లోథా కమిటీతో బీసీసీఐ కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ అసాధ్యంగా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  Champions Trophy  IP-2017  Scrap  ICC  

Other Articles