Virat Kohli’s Message After T20 Loss Will Tell You That We Either Win Or We Learn, But Never Fail

Virat kohli s heartfelt message on india s world cup exit

ICC T20 World Cup, Indian Cricket, team india, Rahane, India vs west indies, team india, virat kohli, MS dhoni, Rohit Sharma, Yuvraj Singh, suresh raina, MS dhoni, india vs west indies, ind vs wi, wankhede stadium, mumbai, semi finals, indian fans, Ravi shastri, Cricket

We win some we lose some, but memories are something we take ahead with us, we move ahead learning from our mistakes and improve each day.

తప్పులు చేశాం.. సరిదిద్దుకుంటాం.. అభిమానులకు థ్యాంక్స్

Posted: 04/03/2016 01:15 PM IST
Virat kohli s heartfelt message on india s world cup exit

వరల్డ్ టీ 20 సెమీఫైనల్స్ లో వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైన తరువాత టీమిండియా డాషింగ్ బ్యాట్సమెన్ విరాట్ కోహ్లీ భారత్ అభిమానులకు మంచి సందేశాన్నిఇచ్చాడు. వరల్డ్ కప్ లో భాగంగా ఆడిన ఐదు మ్యాచులలో 273 పరుగులు సాధించిన విరాట్.. మూడు అర్థశతకాలు సాధించి జట్టు సెమీస్ లోకి వెళ్లేందుకు దోహదపడిన విషయం తెలిసిందే. అయితే సెమీస్ లో ఓటమి తరువాత ఫైనల్స్ చేరుకోలేదన్న భాధ తనలో వున్నా అభిమానులకు మాత్రం సంతోషాన్ని కలిగించేందుక సందేశాన్ని పంపించాడు

ఆటలో భాగంగా అన్ని మ్యాచ్ లు ఏ జట్టు గెలవలేదని, అయితే కొన్ని విజయాల్ని, మరికొన్ని పరాజయాల్ని ఎదుర్కొవడం సాధారణమే అన్నాడు. అయితే సెమీ ఫైనల్స్ మ్యాచ్ వరకు తమకు అభిమానులు అందించిన సహకారం మరువలేనిదని టీమిండియా కోహ్లి స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి విరాట్ ధన్యవాదాలు తెలిపాడు. అయితే టీమిండియా జట్టు ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతుందని కోహ్లి అన్నాడు.

'మా జట్టు విజయాలతో పాటు పరాజయాల్ని కూడా చూసింది. వరల్డ్ టీ 20 టోర్నీ అందించిన  జ్ఞాపకాలు ప్రత్యేకం.  ఆ జ్ఞాపకాలతోనే రాబోయే టోర్నీలకు సిద్ధమవుతాం. ఈ టోర్నీలో భారత ప్రదర్శనపై అభిమానుల నుంచి సానుకూల స్పందన వచ్చింది' అని విరాట్ ఇన్స్టాగ్రామ్ లో తెలిపాడు. ఈ టోర్నీలో విరాట్ అద్భుతమైన ఆటతీరుతో సెమీస్ వరకు వెళ్లిన టీమింటియా.. వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి భారంగా వైదొలిగింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc t20 world cup 2016  India vs west indies  team india  virat kohli  MS dhoni  

Other Articles