Shahid Afridi branded 'absolutely clueless' by Pakistan cricket team manager following dismal World T20 campaign

Shahid afridi was absolutely clueless during world t20 alleges pakistan team manager intikhab alam

Shahid Afridi, branded, clueless captain, clueless afridi, Pakistan cricket team, pakistan cricket team manager, dismal, World T20, afridi pcb, PCB, Shahid Afridi, shahid afridi daughter, Waqar Younis

'A captain in his farewell event after a career spanning nearly 20 years, yet absolutely clueless in terms of on-field tactics and off-field leadership,' Alam said in his tour report.

'క్లూలెస్ కెప్టెన్’ అఫ్రిదీ పరాజయానికి కారణం

Posted: 04/02/2016 07:32 PM IST
Shahid afridi was absolutely clueless during world t20 alleges pakistan team manager intikhab alam

వరల్డ్ టీ 20 టోర్నమెంటులో ఓడినా.. భారతీయుల పట్ల ద్వంద ప్రమాణాలు పాటించిన వెర్రితలగా ప్రవర్తించిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ షాహీద్ అఫ్రీదిని అక్కడి క్రికెట్ బోర్డు టార్గెట్ చేసింది. పాకిస్తాన్  పేలవ ప్రదర్శనకు   ఆఫ్రిదిని బాధ్యుణ్ని చేస్తూ ఆ జట్టు మేనేజర్ ఇంతికాబ్ అలమ్ రూపొందించిన నివేదిక మీడియాకు లీక్ అయ్యింది. అయితే ఈ నివేదిక మీడియా చేతికి చిక్కడం పట్ల పాకిస్థాన్ లో దుమారం రేగుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ కోచ్ వకార్ యూనస్ అందించిన నివేదిక లీక్ కావడం, అందులో ఆఫ్రిది వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిని సంగతి తెలిసిందే.

అయితే వారం వ్యవధిలో ఇంతికాబ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అందజేసిన నివేదికలో కూడా ఆఫ్రిదినే ప్రధానంగా టార్గెట్ చేశారు. ఈ టోర్నీలో ఆఫ్రిది ఎటువంటి ప్రణాళికలు లేకుండా, ప్రత్యర్థులతో ఆడుతున్నప్పుడు వారి వ్యూహ ప్రతివ్యూహాలకు చెక్ పెట్టే విధంగా ఎలాంటి ప్రణాళికలను సిద్దం చేసుకోకుండా ముందుకు సాగాడని అందులో విమర్శించారు. వరల్డ్ టీ 20లో  ఆఫ్రిది 'క్లూలెస్ కెప్టెన్' గా వ్యవహరించడం వల్లే పాక్ జట్టు లీగ్ దశలోనే నిష్ర్కమించినట్లు ఇంతికాబ్ మండిపడ్డారు.
 
వరల్డ్ టీ 20లో జట్టు చెత్త ప్రదర్శన అనంతరం క్రికెట్ బోర్డు పెద్దలపై విమర్శలు రావడంతో పాటు మీడియాకు లీక్ అవుతున్న నివేదికలతో  కలత చెందిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పదవికి షహర్యార్ ఖాన్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే షహర్యార్ కు అత్యంత సన్నిహితుడు, పాకిస్తాన్ క్రికెట్ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ నజామ్ సేథీతో పాటు కొంతమంది సీనియర్ అధికారులు నచ్చచెప్పడంతో ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahid Afridi  pcb  pakistan  world twenty 20  

Other Articles