West Indies have 4-0 record against England in WC T20

West indies vs england in t party a second helping

west indies vs england, wi vs eng, west indies england, west indies vs england, england t20, west indies t 20, virat kohli, kohli, dhoni, joe root, chirs gayle, england, cricket england, england cricket, cricket west indies, west indies criccket, cricket news, cricket

West Indies will take on England -- both former champions -- in a bid to win the marquee tournament, and become the first team to win it twice.

తుది సమరానికి వెస్టిండీస్-ఇంగ్లాండ్ జట్లు సన్నధం..

Posted: 04/03/2016 02:16 PM IST
West indies vs england in t party a second helping

టీ 20 ప్రపంచకప్ లో భాగంగా తుది సమరానికి చేరిన వెస్టీండీస్, ఇంగ్లాండ్ జట్లు టైటిల్ పోరు కోసం మరికోద్ది గంటల్లో సమరశంఖం పూరించనున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ సాయంత్రం జరగనున్న మ్యాచ్ కోసం ఇప్పటికే భారత్ అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి ఒక్క టిక్కెట్ కూడా మిగలలేదని టీమిండియా మాజీ కెప్టెన్, క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు.

కాగా,  గ్రూప్-1లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే ఫైనల్ కు చేరడం విశేషం. ఈ రెండు టీముల్లో ఏది గెలిచినా రెండోసారి వరల్డ్ కప్ అందుకున్న జట్టు అవుతుంది. 2010లో ఇంగ్లండ్, 2012లో విండీస్ టీ20 ప్రపంచకప్ గెలిచాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక ఒక్కోసారి విజేతలుగా నిలిచాయి. తాజా ప్రపంచకప్ లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఇంగ్లీషు జట్టు అనూహ్యంగా ఆడి ఫైనల్ కు చేరింది. ఓటమితో టోర్ని ఆరంభించిన ఇంగ్లండ్ తర్వాత పుంజుకుని టైటిల్ వేటకు సిద్ధమైంది.

మార్చి 16న వెస్టిండీస్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఓడింది. తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్ టీమ్ లను ఓడించి ఫైనల్ చేరుకుంది. లీగ్ దశలో వరుసగా మూడు అగ్రశ్రేణి జట్లను ఓడించిన విండీస్ చివరి లీగ్ మ్యాచ్ లో అనూహ్యంగా అప్ఘానిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. అయితే ఇంగ్లాండ్ మీద 4-0 విజయాలను నమోదు చేసుకున్న వెస్టిండీస్ ఫైనల్స్ లో కూడా అదే దూకుడు సాగిస్తుందా..? లేదా అన్నది చూడాలి. లేక విండీస్ చేతిలో పరాజయానికి ప్రతీకారాన్ని తీర్చుకుని చరిత్రను తిరగరాస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. ఇంగ్లండ్, విండీస్ లో ఏ జట్టు రెండోసారి టీ20 వరల్డ్ టైటిల్ కైవసం చేసుకుంటుందో చూడాలంటే ఇవాళ సాయంత్రం వరకు ఆగాల్సిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc t20 world cup 2016  west indies  england  T20 finals  eden gardens  cricket  

Other Articles