ICC World Twenty20: Despite backlash, Shahid Afridi mentions Kashmir again

Afridi says he is unfit for pakistan team as captain

pakistan vs australia, pak vs aus, aus vs pak, icc world t20, world t20, pakistan australia, shahid afridi, Pakistan Cricket Captain, australia, retirement, ICC T20 World Cup, afridi pakistan, sports news, sports, cricket

Pakistan skipper Shahid Afridi mentioned Kashmir during the post-match presentation after his team were knocked out of the ICC World Twenty20 2016 by Australia

పాక్ జట్టుకు కెప్టెన్ గా పనికిరాను..

Posted: 03/26/2016 09:28 AM IST
Afridi says he is unfit for pakistan team as captain

పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది నాలుక ఎన్ని వైపుల పదనుందో తెలియడం లేదు. ప్రపంచ కప్ లో భాగంగా భారత్ లో జట్టుతో పాటు అడుగుపెట్టిన ఆయన తన రిటైర్మెంటుపై రోజుకో విధంగా స్పందించడమే ఇందుకు కారణంగా మారింది. వరల్డ్ ట్వంటీ 20లో భారత్ చేతిలో పరాజయం పోందగానే తన రిటర్మెంటుపై ఒకలాంటి సంకేతాలు ఇచ్చి.. ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు ముందు నిర్ణయం తీసుకోలేదని చెప్పిన ఆఫ్రిది.. అసీస్ చేతిలో ఓటమి అనంతరం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన రిటైర్మెంటుపై మళ్లీ పరోక్ష సంకేతాలు చేశాడు.

తాను అసలు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా చేయడానికి అర్హుడిని కానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టుకు సారథ్యం వహించే క్రమంలో తీవ్రమైన ఒత్తిడికి లోను కావడమే ఇందుకు కారణమన్నాడు.  అయితే పాక్ కు కెప్టెన్ చేయడాన్ని ఎంజాయ్ చేశానన్నాడు. కాగా, ఆసీస్తో జరిగిన మ్యాచే తనకు చివరి మ్యాచ్ అంటూ వార్తలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆఫ్రిది స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. పాకిస్తాన్లో దేశ ప్రజల సమక్షంలో దీనిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు.

నాలుగైదు రోజుల్లో స్వదేశానికి చేరతామని, ఆ తరువాతే తన రిటైర్మెంట్పై నిర్ణయం వెలువరిస్తానన్నాడు. పాకిస్తాన్ జట్టుకు  దేనివల్ల మంచి జరుగుతుందో అది చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆఫ్రిది స్పష్టం చేశాడు.  కోల్ కతాలో భారత్తో జరిగిన మ్యాచ్కు పాకిస్తాన్ నుంచి, కశ్మీర్ నుంచి వచ్చి తమ జట్టుకు మద్దతు తెలిపిన వారికి ఆఫ్రిది కృతజ్ఞతలు తెలిపాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ 21పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తద్వారా టోర్నీలో మూడో పరాజయాన్ని మూటగట్టుకున్న పాకిస్తాన్ వరల్డ్ టీ 20 నుంచి నిష్క్రమించడంతో అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేశాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahid Afrid  Pakistan Cricket Captain  australia  retirement  ICC T20 World Cup  

Other Articles