mohali match winner enters icc t20 world cup semi finals

Team india aussies in icc t20 world cup semi finals race

india vs australia, australia vs india, ind vs aus, aus vs ind, shane watson, watson, watson memories, watson australia, watson aus, shane watson vs india, world t20, world cup 2016, cricket

Team india and australia face each other in pool b last league match, the winner enters into semi finals in pool b in mohali on sunday.

సెమిఫైనల్స్ రేసులో అస్ట్రేలియా, టీమిండియా.. గెలుపెవరిది.?

Posted: 03/26/2016 04:38 PM IST
Team india aussies in icc t20 world cup semi finals race

టి-20 ప్రపంచ కప్ గ్రూప్-2 లో సెమీస్ కు చేరే జట్లు ఏమీ అంటే.. ఆదివారం వరకు వేచి వుండండా.. అనక చెబుతాం అంటూ సమాధానాలే వినబడుతున్నాయి. అస్ట్రేలియాను సొంత దేశంలోనే టీ 20 సిరీస్ లో ఓడించి.. విజయాన్ని అందుకుని అప్పటినుంచి టీ 20 ఫోట్టిఫార్మెట్ క్రికెట్ లో తనదైన ముద్రవేసుకుంటే వచ్చిన టీమిండియ.. అదే ఊపులో అసియా కప్ ను కూడా గెలచింది. టీ20 వరల్డ్ కప్ లో ప్రారంభ మ్యాచ్ లో చవిచూసిన ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న టీమిండియా విజయాలను రాబట్టుకున్నా.. అది తమ స్థాయికి తగ్గట్టుగా లేదని భారత్ అభిమానులు పెదవి విరుస్తున్నారు

వరల్డ్ కప్ లో న్యూజీలాండ్ తరువాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ లతో జరిగిన రెండు మ్యాచ్ లలోనూ భారత్ ఉత్కంఠకు గురవుతూనే చూసింది. ఇక అస్ట్రేలియాతో కూడా అదే ఉత్కంఠ అభిమానులలో వుంది. గెలుస్తామా లేదా..? సెమీస్ కు చేరుతామా..? లేదా..? అన్న ప్రశ్నల అభిమానులను కంటిమీద కునుకు కరువయ్యేలా చేస్తుంది. ఇంతకు ముందు భారత్ ఎప్పుడూ ఇంతటి ఒత్తిడితో కూడిన మ్యాచ్ లను ఎదుర్కోన లేదు. అయితే ఇప్పడు అడుతున్న ప్రతీ మ్యాచ్ కీలకంగా పరిణమించింది.

ఎలాంటి అంచనాలు లేకుండా, కేవలం తమ లక్ష్యాన్ని చేరుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్న న్యూజీలాండ్ సెమీస్ లో తన స్థానాన్ని పథిలం చేసుకోగా, ఇక మరో స్థానంలోకి ఎవరు చేరుకుంటారన్నది నిర్ణయించే కీలకమైన మ్యాచ్ ఇది. దీంతో ఈ మ్యాచ్ కూడా ధోని సేన తప్పక గెలవాల్సిందే. అయితే ఇక్కడ పరిగణించాల్సిన అంశమేమంటే.. అసీస్, టీమిండియా రెండు జట్లు న్యూజీలాండ్ చేతిలోనే ఓటమిని చవిచూశాయి. ఇక రేపు మొహాలీలో ఏ జట్టు పైచేయి సాధిస్తుందోనన్న ఉత్కంఠ మాత్రం మ్యాచ్ మ్యాచ్ కు పెరుగుతుందే తప్ప.. తగ్గడం లేదు. ఈ రెండు జట్లు చెరో నాలుగు పాయింట్లతో వున్నాయి.

టీమిండియా సెమీస్ చేరాలంటే ఆదివారం మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్లో గెలిచితీరాలి. ఈ మ్యాచ్లో ధోనీసేన గెలిస్తే గ్రూపు-2లో భారత్ ద్వితీయ స్థానంలో నిలిచి నాకౌట్ బెర్తు దక్కించుకుంటుంది. కాగా మ్యాచ్ రద్దయితే టీమిండియాకు నిరాశ తప్పదు. అప్పుడు భారత్, ఆసీస్ చెరో ఐదు పాయింట్లతో సమానంగా ఉంటాయి. అయితే భారత్ కంటే మెరుగైన రన్రేట్ ఉన్న కంగారూలు సెమీస్కు వెళ్తారు. కాబట్టి సెమీస్ చేరాలంటే భారత్ ఆసీస్పై గెలిచితీరాలి. మరి టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుదాం...

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  australia  world twenty 20  semi finals  ind vs aus  Team india  cricket  

Other Articles