india qualifies to semi finals only by beating australia

India enters semi finals by beating aussies in wt20

indian cricket team, indian cricket team holi, india holi photos, india holi, indian cricket team photos, cricket photos, harbhajansingh, rohith sharma, india, bangladesh, icc t20 world cup-2016

Team india enters into semi finals in pool b if only beats australia in final league match in chandigarh on sunday.

అస్ట్రేలియాను ఓడిస్తేనే సెమిఫైనల్స్ లోకి టీమిండియా

Posted: 03/25/2016 06:15 PM IST
India enters semi finals by beating aussies in wt20

వరల్డ్ టీ 20లో భాగంగా  బంగ్లాదేశ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో ఒక పరుగు తేడాతో గెలిచి నాకౌట్ ఆశలను సజీవంగా నిలుపుకున్న టీమిండియా.. సెమీస్కు చేరాలంటే ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో  తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత జట్టు మరో ముందుడుగు వేసి సెమీస్ లోకి వెళ్లాలంటే అసీన్ ను చిత్త చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో చివరి బంతి వరకు విజయం దోబుచులాడింది. అయితే అనుభవం, చతురత రెండింటినీ మేళవించి పాండ్యాతో బాలింగ్ చేయించిన ధోని చివరి బంతికి రనౌట్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

అయితే అసీస్ తో జరిగే మ్యాచ్ ఇందుకు పూర్తి భిన్నంగా వుంటుంది. ఒత్తిళ్లను జయించడం, వికెట్లు కోల్పోతున్న స్కోరుబోర్డును పరుగులెత్తించడం అసీస్ కు అలవాడు. అంతేకాదు టీమిండియా గర్వంగా చెప్పుకుంటున్నట్లు లాస్ట్ బాట్స్ మెన్ వరకు అసిస్ జట్టులోనూ నిలదోక్కకుని భారీ షాట్లు కోట్టే సత్తా వున్న బ్యాట్స్ మెన్లు వున్నారు. పాకిస్తాన్ తో జరిగనున్న మ్యాచ్ అసీస్ గెలిస్తే.. ఆ జట్టును ఓడించక తప్పని పరిస్థితి టీమిండియా ఎదుట వుంది.

అదే పాకిస్థాన్ గెలిచి ఆ తరువాత భారత్పై ఆసీస్ గెలిస్తే మాత్రం ఈ మూడు జట్లు తలో రెండు మ్యాచ్ల్లో విజయం సాధించినట్లువుతుంది. అప్పుడు నాకౌట్ సమీకరణాలకు నెట్ రన్ రేట్ పైనే ఆధారపడాలి. అయితే ప్రస్తుత భారత్ నెట్ రన్రేట్ (-0.546) ఆందోళనకరంగా ఉండగా,  పాకిస్తాన్ రన్ రేట్ (+0.254), ఆస్ట్రేలియా రన్ రేట్(+0.108)లు ముందంజలో ఉన్నాయి. భారత్ గెలిచిన రెండు మ్యాచ్లతో పాటు, నెట్ రన్ రేట్ను చూస్తే మన జట్టు సెమీస్ కు చేరడం కష్టమే. వీటితో సంబంధం లేకుండా ధోని సేన సెమీ ఫైనల్ కు చేరాలంటే కచ్చితంగా ఆసీస్పై మ్యాచ్ను గెలవడం ఒక్కటే మార్గం.

ఇదిలా ఉండగా వరల్డ్ టీ 20లో టీమిండియా ఇంకా పూర్తిగా గాడిలో పడలేదనే చెప్పాలి.  ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో జరిగిన ట్వంటీ 20 సిరీస్ను,  ఆ తరువాత స్వదేశంలో శ్రీలంకతో సిరీస్ను, బంగ్లాదేశ్లో జరిగిన ఆసియాకప్ను గెలిచి మంచి ఊపు మీద కనిపించిన భారత్.. వరల్డ్ టీ 20 వచ్చేసరికి మాత్రం జట్టు పూర్తిస్థాయిలో ఆడటం లేదు.  ఈ టోర్నీలో న్యూజిలాండ్తో ఓటమి అనంతరం భారత్ సాధించిన రెండు విజయాలు జట్టు స్థాయి కన్నా తక్కువగానే వున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతూనే వున్నాయి

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  australia  world twenty 20  semi finals  Team india  cricket  

Other Articles