Pakistan v Australia: Have not decided on retirement, says Shahid Afridi

No decision on retirement says shahid afridi

pakistan vs australia, pak vs aus, aus vs pak, icc world t20, world t20, pakistan australia, shahid afridi, afridi pakistan, sports news, sports, cricket

Shahid Afridi earlier said that the Pakistan's match against Australia in the ICC World T20 could be his last.

రిటైర్మెంట్ నిర్ణయంపై అఫ్రిదీ డోలాయమానం..

Posted: 03/25/2016 06:13 PM IST
No decision on retirement says shahid afridi

భారతీయుల నుంచి లభించే ప్రేమాభిమానాలు తమ స్వదేశంలో కూడా లభ్యంకావని చేసిన వ్యాఖ్యలతో విమర్శల పాలై, ఆ తరువాత రిటైర్మెంట్ సంకేతాలు ఇచ్చిన పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ తన నిర్ణయం మార్చుకున్నట్లున్నాడు. కాశ్మీర్ నుంచి తమ అభిమానులు మ్యాచ్ లను చూడటానికి వస్తారని వివాదాస్పద వ్యాక్యలు చేసిన అఫ్రీది.. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో మళ్లీ స్వదేశంలో అభిమానుల అభిమానం పొందగలిగానుకుంటా. అందకనే కాబోలు తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అఫ్రిదీ తాజాగా ప్రకటించాడు.

పాకిస్తాన్లో దేశ ప్రజల సమక్షంలో దీనిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. టి-20 ప్రపంచ కప్లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్కు ముందు రిటైర్మెంట్ విషయంపై స్పందించాడు. తన కెరీర్ లో చివరిమ్యాచ్ ఆడబోతున్నట్టు చెప్పాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరగబోయే మ్యాచ్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కావొచ్చని ప్రకటించాడు. కాగా, ప్రపంచకప్‌ అనంతరం అఫ్రిదీని కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇప్పటికే ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవుతానన్న షరతుమీదే అతడికి కెప్టెన్సీ కట్టబెట్టినట్టు వెల్లడించింది. అయితే ఈ రోజు ఆస్ట్రేలియాతో మ్యాచే చివరిదన్న అఫ్రిదీ.. రిటైర్మెంట్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahid Afrid  Pakistan Cricket Captain  retirement  ICC T20 World Cup  

Other Articles