Shahid Afridi’s statements on Kashmir not politically correct: Anurag Thakur

Bcci criticises shahid afridi for comment on kashmir

shahid afridi, anurag thakur, afridi, thakur, afridi thakur, afridi kashmir, afridi comments, afridi world t20, afridi australia, afridi world twenty20, world twenty20, world twenty20 pakistan

Shahid Afridi drew criticism from BCCI secretary for his comments on getting support from fans in Kashmir

క్రీడాస్ఫూర్తిని అబాసుపాలు చేసిన షాహిద్ అఫ్రీదీ

Posted: 03/23/2016 08:00 PM IST
Bcci criticises shahid afridi for comment on kashmir

టి-20 ప్రపంచ కప్లో ఆడేందుకు భారత్కు వచ్చిన పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది తొలుత భారత్ దేశ క్రీకెట్ అభిమానుల నుంచి తమకు స్వదేశంలో కన్నా అధిక ప్రేమానురాగాలు, అధరాభిమానాలు కురుస్తున్నాయి చెప్పి స్వదేశం నుంచి విమర్శలు ఎదుర్కోన్నారు. అయితే తనపై స్వదేశంలో విమర్శలు శృతిమించడం, ఇక ప్రపంచ కప్ లో కూడా తన నేతృత్వంలో పాకిస్తాన జట్టు పూర్తిగా విఫలమవ్వడంతో తన కెప్టెన్సీకే ఎసరు వస్తుందని తెలుసుకున్న అప్రిదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించే బదులు తానే తప్పుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చి అప్రీదీ ఇక భారత్ తో పని అయిపోందనుకున్నాడో ఏమో ఏకంగా తానోక క్రికెటర్ , క్రీడాకారుడన్న విషయాన్ని మర్చి క్రీడాస్ఫూర్తినే అబాసుపాలు చేసేలా రాజకీయ నేత తరహాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలవుతున్నాడు. మొహాలీలో న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్కు కశ్మీర్ ప్రజలు చాలామంది తమకు మద్దతుగా తరలివస్తారంటూ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలను బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తప్పుపట్టారు.

'ఆఫ్రిది ఇలాంటి ప్రకటన చేయడం రాజకీయంగా సరికాదు. క్రీడాకారులు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. పాక్లో ఆఫ్రిదిని విమర్శించడానికి ఇదే కారణం' అని ఠాకూర్ అన్నాడు.ఆఫ్రిది ఇప్పటికే పెద్ద వివాదంలో ఇరుకున్న సంగతి తెలిసిందే. పాక్లో కంటే భారత్‌లోనే తమకు ఎక్కువ అభిమానం లభిస్తోందని ఆఫ్రిది వ్యాఖ్యలు చేయడంతో స్వదేశంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచ కప్లో పాక్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడం కూడా అతనికి ఇబ్బందికరంగా మారింది. ప్రపంచ కప్ తర్వాత ఆఫ్రిదిని జట్టు సారథిగా తొలగిస్తామని ఇప్పటికే పీసీబీ ప్రకటించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : t20 world cup-2016  India  India vs pakistan  shahid afridi  pakistan cricket board  

Other Articles