Twitter Erupts as PM Modi and SRK Laud Team India’s Performance

Celebs lauds team india for thrilling win over bangladesh

Narendra Modi, Team India, Amitabh Bachchan, Shah Rukh Khan, India vs Bangladesh, World T20 2016, ICC World T20, india thrilling win, social media, celebrities laud team india win

India managed a narrow escape from elimination as they beat Bangladesh by 1 run in ICC World T20.

టీమిండియా గెలుపుపై సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ

Posted: 03/24/2016 11:25 AM IST
Celebs lauds team india for thrilling win over bangladesh

టీమిండియా టీ 20 ప్రపంచ కప్ లో సెమీస్ ఆశలను సజీవంగా వుంటుకోవాలంటే.. తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ అది. కొందరు బంగ్లదేశ్ తోనే కదా గెలిచేస్తుందిలే అని అంచనా వేసుకున్నారు. మరికోందరు అమ్మో బంగ్లాను నమ్మెందుకు వీలు లేద అంటూ టీవీలకు హత్తుకుపోయారు. దాదాపుగా మిత్రులు ఒకరికోకరు ఫోన్లు చేసుకుని, లేదా వాట్సప్ లో చాటింగ్ చేసుకుంటూ మ్యాచ్ లను తిలకించారు. నరాలు తెగే ఉత్కంఠ. అర్థరాత్రి, అపరాత్రి అని కూడా చూడకుండా దేవుళ్లకు ప్రార్థనలు మిన్నంటాయి. ఈ తరుణంలో చివరి ఓవర్ 6 బంతులలో 11 పరుగులు చేయాల్సిన అవసరం బంగ్లాదేశ్ జట్టుకు ఏర్పడింది.

దీంతో పడుకున్న వారు కేూడా లేచి టీవీల వద్దకు ముఖం పెట్టారు. ఇక మిగిలింది మూడు బంతులు..  కావాల్సింది కేవలం రెండు పరుగుటే. దాదాపు బంగ్లదేశ్ విజయం సాధించిందని భావించిన వాళ్లు టీవీలను కట్టేయబోయారు. ఆ తరువాతి బంతికి ఓ వికెట్ పడింది. భారత్ అభిమానులలో ఉత్కంఠ ఏమాత్రం తగ్గలేదు. ఇలా ఆ తరువాతి బంతిలో మరో వికెట్. ఆ తరువాతి బంతిలో మరో వికెట్ ఇలా చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు పడిపోయాయ్. భారత క్రికెట్ అభిమానులకు నిజంగా పండగ వాతవరణం అలుముకుంది.

అయితే ఈ మ్యాచ్ లో కీలక ఓవర్ లో మూడు వికెట్లు సాధించిన టీమిండియాకు, ముఖ్యంగా కెప్టెన్ దోనిని, హర్థిక్ పాండ్యను అందరూ ప్రశంసలతో ముంచారు. సోషల్ మీడియా కూడా అర్థరాత్రి అని కూడా చూడకుండా ట్విట్లతో, ఫేస్ బుక్ లతో, వాట్సాప్ లలో అభినందనలు వెల్లువెత్తాయి. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా టీమిండియా పోరాట స్పూర్తికి ముగ్దుడయ్యాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీమిండియా మ్యాచ్‌ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా చూశారు.

అంతేకాదు తన అభిమానులతో మ్యాచ్ ముగిసిన వెంటనే ఆయన ట్వీట్ ద్వారా తన అనుభూతులను పంచుకున్నారు. గేమ్ చాలా థ్రిల్లింగా ఉందంటూ టీమిండియాకు అభినందనలు తెలిపారు. చాలా సంతోషంగా ఉందని, బంగ్లాదేశ్ కూడా బాగా ఆడిందని అన్నారు. అయితే, ఈ మ్యాచ్ మనందరికీ ఒక సందేశం ఇస్తోందని గుర్తు చేశారు. ఎప్పుడూ అంతా అయిపోయిందని వదిలిపెట్టేయకూడదని, ఆశను సజీవంగా వుంచండీ.. జీవితం ఏ క్షణంలోనైనా ఏ మలుపైనా తీసుకోవచ్చని.. ఎప్పుడూ నిరుత్సాహ పడకూడదని చెప్పారు.

మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు టీమిండియాను సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తారు. మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులు చేస్తే బంగ్లాదేశ్ విజయం సాధిస్తుందన్న దశలో.. ఆ మూడు బంతులలో మూడు వికెట్లు పడగొట్టి, కెప్టెన్సీ సామర్థ్యం అంటే ఏంటో, వ్యూహాలు ఎలా ఉంటాయో చూపించిన మహేంద్ర సింగ్ ధోనీని ఆకాశానికి ఎత్తేశారు. ట్విట్టర్ వరుసపెట్టి మోగుతూనే ఉంది. ఫేస్‌బుక్ పేజీలు నిండిపోయాయి. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ క్రికెట్ ఫొటోలే. సోషల్ మీడియా టీమిండియాకు హారతి పట్టింది.

ఈ విజయంలో పాలుపంచుకున్న క్రికెటర్లు కూడా మ్యాచ్ ముగిసిన తర్వాత మొబైల్ ఫోన్లు పట్టుకుని తమ ఆనందాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఈ మ్యాచ్‌తో చాలా మజా వచ్చిందని, ఇప్పటివరకు ఇలాంటి మ్యాచ్ తనకు అనుభవంలోకి రాలేదని, అద్భుతంగా ఉందని చివరి మూడు బంతుల్లో ఒక క్యాచ్ పట్టిన శిఖర్ ధావన్ అన్నాడు. టీమ్ ఎఫర్ట్ చాలా బాగుందంటూ హిందూస్థాన్ జిందాబాద్ అని ట్వీట్ చేశాడు. ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం కొంత పెద్దమనిషి తరహాలో స్పందించాడు. బంగ్లాదేశ్ కూడా చాలా అద్భుతమైన క్రికెట్ ఆడిందంటూ వాళ్లనూ ప్రశంసించాడు. చాలా అలసిపోయినట్లు అనిపిస్తోందని, అదే సమయంలో చివరి వరకు అంతా చాలా బాగా ఆడినందుకు సంతోషంగా కూడా ఉందని తన ట్వీట్‌లో వెల్లడించాడు. ఇక షారుఖ్ ఖాన్, అమితాబ్ వంటి సెలబ్రిటీలు కూడా టీమిండియా విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs bangladesh  t20 world cup  india thrilling win  narendra modi  social media  

Other Articles