Shahid Afridi indicates he would retire after ICC World Twenty20

Shahid afridi indicates he would retire after world twenty20

pakistan vs new zealand, new zealand vs pakistan, pak vs nz, nz vs pak, shahid afridi, afridi, pakistan vs australia, australia vs pak, pak vs aus, icc world t20, world t20, Cricket, ICC WT20 2016, Twenty20 World cup, Australia

Pakistan's loss in two out of three games have dampened their prospects of securing a last-four berth in the mega-event.

రిటైర్మెంట్ సంకేతాలను ఇచ్చిన అఫ్రీదీ..

Posted: 03/23/2016 05:37 PM IST
Shahid afridi indicates he would retire after world twenty20

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకబోతున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది సూచనప్రాయంగా వెల్లడించాడు. పాక్ టీ 20 జట్టుకు కెప్టెన్ గా వున్న షాహీద్ అఫ్రదీ.. తన నేతృత్వంలో ప్రస్తుతం జట్టు తరుచుగా ఓటమి పాలవ్వతున్న నేపథ్యంలో ఆయనను జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. దీంతో తనకు తానుగానే క్రికెట్ కెరీర్ నుంచి తప్పుకోవడం మంచిదన్న ఉద్దేశ్యంలో అఫ్రీదీ వున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ శుక్రవారం అస్ట్రేలియాతో జరగనుందే తన చివరిమ్యాచ్ ఆడబోతున్నట్టు చెప్పాడు.

టీ20 ప్రపంచకప్ లో భాగంగా మంగళవారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 22 పరుగులతో ఓడిపోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆఫ్రిది మాట్లాడుతూ... ఆస్ట్రేలియాతో శుక్రవారం జరగబోయే గేమ్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కావొచ్చని అవుతుందని ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ కు సెమీస్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోనప్పటికీ అతడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, ప్రపంచకప్‌ అనంతరం అఫ్రిదిని కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇప్పటికే ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవుతానన్న షరతుమీదే అతడికి కెప్టెన్సీ కట్టబెట్టినట్టు వెల్లడించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahid Afrid  Pakistan Cricket Captain  ICC T20 World Cup  

Other Articles