India to take on Pakistan in a full series in December

Bjp mp opposes india pakistan cricket series in lok sabha

India to take on Pakistan in December, india pakisthan cricket series may resume soon, Bharatiya Janata Party (BJP), BJP parliamentarian RK Singh, Former home secretary RK Singh, Bihar's Arrah MP RK Singh,, RK Singh, Zaki-ur-Rehman Lakhvi, terrorist Dawood Ibrahim, india score, pakistan wickets, icricket news,latest news,latest topics,cricket stories,india,world cup news,latest cricket news,cricket updates,

India are set to play a full series against Pakistan in the UAE, three Tests, five ODIs and two T20Is in December, but BJP MP expressed his opposition

త్వరలో ఇండియా పాకిస్థాన్ సీరీస్..? వ్యతిరేకించిన బీజేపి ఎంపీ

Posted: 05/11/2015 08:55 PM IST
Bjp mp opposes india pakistan cricket series in lok sabha

భారత్-పాకిస్థాన్ దాయాధి దేశాలు.. ఏం చేసినా సంచలనమే. అయితే ఇరు దేశాల మధ్య క్రికెట్ జరుగుతుందంటే.. అ కిక్కే వేరు. ఇరుదేశాల క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచ దేశాల క్రికెట్ అభిమానులు అమితాసక్తితో తిలకించే మ్యాచ్ అదే. ఇందుకు ఇటీవల జరిగిన ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటే సాక్షం. ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచంలో సుమారు పది కోట్ల మంది ఆ మ్యాచ్ ను ప్రత్యక్షంగా, పరోక్షంగా తిలకించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మరోసారి క్రికెట్ సీరీస్ సాగించేందుకు ప్రయత్నాలు మళ్లీ ముమ్మరం అయ్యాయి. ఇది ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు శుభవార్తే.

ఈ ఏడాది డిసెంబర్ మాసంలో ఇరు దేక్రికెట్ సిరీస్ సాగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి చర్యలు చేపట్టిందని వార్తలు వస్తున్నాయి. వచ్చే డిసెంబర్లో భారత్, పాక్ మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్.. బీసీసీఐ అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియాతో సమావేశమై ఈ మేరకు చర్చలు జరిపారు. పాక్లో భారత్ జట్టు పర్యటించాల్సిందిగా ఆయన దాల్మియాను విజ్ఞప్తి చేశారు. ఇందుకు బీసీసీఐ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఐపీఎల్లో ఆడేందుకు పాక్ క్రికెటర్లను అనుమతించాలని పీసీబీ చీఫ్ దాల్మియాను కోరారు.

కాగా ఇవాళ బిసిసిఐ మండలి సభ్యుడు, ఐపీఎల్ చైర్మన్, మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. దీంతో అసలు దాయధి పోరుపై బిసిసిఐ ఇంకా ఎటూ తేల్చుకోలేదని విమర్శలు కూడా వస్తున్నాయి. సరిహద్దు వెంబడి వరుస కాల్పులకు పాకిస్థాన్ ప్రేరేమిత ఉగ్రవాద సంస్థలు పాల్పడుతున్నాయని, వాటని నియంత్రించాలని భారత్ ప్రభుత్వం కోరింది. అయినా పాకిస్థాన్ నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోగా, సరిహద్దులోని భారత నియంత్రణ రేఖ మీదుగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డాయి. అంతటితో ఆడకుండా 2007లో భారత భూబాగంలోకి చోచ్చుకుని వచ్చి.. భారత దేశ ఆర్థిక రాజధాని ముంబాయిపై ముష్కరులు దాడి చేసిన ఘటన చోటుచేసుకున్న తరుణంలో ఇరు దేశాల మధ్య వున్న సత్సంబంధాలను భారత్ తెంచుకుంది.  

అయితే పాకిస్తాన్ తో భారత్ జట్టు క్రికెట్ సీరీస్ మళ్లీ చర్యలు పున:ప్రారంభమయ్యాయని వస్తున్న వార్తల నేపథ్యంలో పార్లమెంటు సాక్షిగా తన వ్యతిరేకతను చెప్పారు బీహార్ ఎంపీ., కేంద్ర మాజీ హోం కార్యదర్శి అర్కే సింగ్. ముంబాయిలో ముష్కరదాడుల వెనక వున్న ప్రధాన సూత్రదారి జక్కీర్ ఉల్ రెహ్మాన్ లఖ్మీ పాకిస్థాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఇలాంటి నేపథ్యంలో పాకిస్థాన్ తో ఎలాంటి సంబంధాలను పునరుద్దరించుకోవడం సహేతుకం కాదని అర్కే సింగ్ స్పష్టం చేశారు. ఉద్రవాదులకు స్వర్గధామంగా మారిన దేశంలో మనం సంబంధాలను ఎలా పునరుద్దరించుకుంటామని ఆయన ప్రశ్నించారు. ముంబాయి బాంబు దాడుల కేసులు ప్రధాన సూత్రదారి దావుద్ ఇబ్రహీంకు కూడా పాకిస్తాన్ రక్షణ కల్పిస్తుందని.. అలాంటి వారితో క్రికెట్ ఆడాల్సిన అవసరమేంటని అర్కేసింగ్ ప్రశ్నించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  pakisthan  cricket series  bcci  

Other Articles