Kumar Sangakkara accuses London airport officials of racist behaviour | Sangakkara

Kumar sangakkara accuses london airport officials of racist behaviour

Kumar Sangakkara news, Kumar Sangakkara updates, Kumar Sangakkara controversy, Kumar Sangakkara london airport, Kumar Sangakkara racism, Kumar Sangakkara immigration officer, racist behaviour, sri lankan cricketers

Kumar Sangakkara accuses London airport officials of racist behaviour : Sri Lankan cricketer Kumar Sangakkara took to micro-blogging site Twitter to allege a racial discrimination and rough treatment to him at the London airport.

లండన్ ఎయిర్ పోర్టులో లంక ఆటగాడికి అవమానం

Posted: 05/12/2015 07:20 PM IST
Kumar sangakkara accuses london airport officials of racist behaviour

శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కరకు లండన్ ఎయిర్ పోర్టులో ఘోర అవమానాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. కౌంటీ క్రికెట్ కోసం ఆడేందుకు ఉత్సాహంగా లండన్ కు పయనమైతే.. ఓ ఆఫీసర్ రూపంలో ఇతనికి నిరాశ ఎదురైంది. తాను లండన్ ఎయిర్ పోర్టులో అవమానకర పరిస్థితిని ఎదుర్కొన్నానని... ఓ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ తన పట్ల వర్ణ వివక్ష ప్రదర్శించాడని స్వయంగా ఈ ఆటగాడే ట్విటర్ లో పేర్కొన్నాడు.

గత 15 ఏళ్లుగా సంగక్కర కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ సందర్భంగా కౌంటీల్లో సర్రే జట్టుకు ఆడేందుకు ఈ వికెట్ కీపర్ లండన్ చేరుకున్నాడు. అయితే.. అక్కడ ఇతనికి ఓ ఆఫీసర్ నుంచి అవమానం ఎదురవుతుందని ఇతడు ఊహించలేకపోయాడు. ఆ ఎయిర్ పోర్టులో ఓ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ తనపట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. చాలా అతి చేశాడని ఈ క్రికెటర్ తెలిపాడు. అయితే.. ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలను ఇతడు వెల్లడించలేదు.

ఈ వ్యవహారంపైనే సంగా ట్విటర్ లో వెల్లడిస్తూ.. ‘గత 15 ఏళ్లుగా నేను కౌంటీ క్రికెట్ ఆడుతున్నాను. మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. రంగు, మతం, ప్రతిష్ఠిదేముంది.. ప్రతి ఒక్క ప్రయాణికుడికి మర్యాదనివ్వాలి. తనిఖీలు పక్కాగా వుండాలి. కానీ.. అవతలి వ్యక్తులు కనీస సభ్యత, సంస్కారం ప్రదర్శించాలని మనం ఆశించడంలో తప్పులేదు’ అని పేర్కొన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kumar Sangakkara  London Airport  Racist Behaviour  

Other Articles