captains hit runs in ICC Cricket World Cup finals | World Cup

Captains hit runs in icc cricket world cup finals

michael clarke, New zealand vs Australia, New zealand versus Australia final, ICC Cricket World Cup 2015 final match, world cup final live updates, cricket world cup final scores, icc cricket world cup finals, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, New zealand, New zealand icc CWC 2019, Sports, World Cup Live

captains hit runs in ICC Cricket World Cup finals

ఫైన్సల్స్ లో కెప్టెన్ ఇన్నింగ్స్.. ఆనవాయితీ

Posted: 03/29/2015 09:07 PM IST
Captains hit runs in icc cricket world cup finals

క్రీకెట్ టీమ్ కు కెప్టెన్ చాలా ముఖ్యం. ఫైలెట్ లేని విమానం, లోకో డ్రైవర్ లెని రైలు, కెప్టెన్ లేని షిప్, డ్రైవర్ లేని బస్సు.. ఏది తీసుకున్నా.. అవి సరిగ్గా గమ్యానికి చేరవు. తెగిన గాలిపటంలో దారి తెన్నూ లేకుండా పోతాయి. అయితే జట్టుకు కెప్టెన్ వుండి.. కెప్టెన్ ఇన్నింగ్స్ అడితే.. ఆ జట్టుకు అదే పెద్ద మనోధైర్యం. అయితే ప్రపంచ కప్ చరిత్ర తీసుకున్నా.. ఫైనల్స్ చేరుకున్న జట్లు ఏవైనా విజయం సాధించాలంటూ జట్టు సారధులు బంతులను చితకబాదాల్సిందే. అవునండీ.. ఇవాళ క్లార్క్ మాత్రమే కాదు.. గత ప్రపంచ కప్ లో ధోణి కూడా ఇలానే బాదాడు.

ఇవాళ్లి మ్యాచ్ లో దాదాపుగా అసీస్ ఆద్యంతం పైచేయి కనబర్చినా..ఆసీస్ విజయంలో జట్టు సారథి మైఖైల్ క్లార్క్ ఇన్నింగ్స్ అత్యంత కీలకమని మ్చాచ్ చూసిన అందరికీ అర్థమయ్యే ఉంటుంది! ఒక్క క్లార్కేకాదు.. 2011 ప్రపంచ కప్ లో థోనీ.. 2003లో రికీ పాంటింగ్.. 1992లో ఇమ్రాన్ ఖాన్.. 1975లో క్లైవ్ లాయిడ్.. ఇలా ఇప్పటివరకు జరిగిన 11ప్రపంచ కప్ ఫైనల్స్ లో సగానికి సగం మ్యాచ్ల్లో సారథులు బ్యాట్ ఝుళిపించిన ప్రతిసారి ఆయా జట్లు విజయతీరాలకు చేరడం.. కప్పును ముద్దాడటం గమనార్హం.

* 2015- ఆస్ట్రేలియా-  మైఖేల్ క్లార్క్- 74 (84 బంతుల్లో, 10 ఫోర్లు, ఒక సిక్సర్)
* 2011- ఇండియా- మహేంద్ర సింగ్ ధోనీ- 91 (79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు)
* 2003- ఆస్ట్రేలియా- రికీ పాంటింగ్ - 140 (121 బాల్స్, 4 ఫోర్లు, 8 సిక్స్లు)
* 1996- శ్రీలంక- రణతుంగ- 47 (37 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్)  
* 1992- పాకిస్థాన్- ఇమ్రాన్ ఖాన్- 72 (110 బంతుల్లో, 5 ఫోర్లు, ఒక సిక్సర్), ఒక వికెట్
* 1975- వెస్టిండీస్- క్లైవ్ లాయిడ్- 102 (85 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు)

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  captain innings  

Other Articles