ICC Cricket World Cup 2019 will be hosted by England | World Cup

Icc cricket world cup 2019 will be hosted by england

ICC Cricket World Cup 2015 final match, world cup final live updates, cricket world cup final scores, icc cricket world cup finals, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, New zealand, New zealand icc CWC 2019, Sports, World Cup Live

The ICC Cricket World Cup 2019 will be hosted by England and Wales, from 30 May to 15 July 2019.

క్రికెట్: పురుటిగడ్డపైనే.. 2019 ప్రపంచకప్

Posted: 03/29/2015 08:33 PM IST
Icc cricket world cup 2019 will be hosted by england

నలభై నాలుగు రోజుల పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులకు కంటి మీద కునుకు కరువు చేసిన 11వ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ వేడుకలు ఇవాళ్టితో ముగిసాయి. కివీస్ పై అసీస్ సాధించిన ఏడు వికెట్ల విజయంతో జగజ్జేతగా అసీస్ నిలిచింది. దీంతో వేడుకలు సమాస్తమయ్యాయి. ఈ తరుణంలో వచ్చే పర్యాయం 12వ ప్రపంచ క్రికెట్ కప్ ఎక్కడ నిర్వహిస్తారన్న ప్రశ్న అందరి మదిలోనూ మెదలుతోండి. అయితే క్రికెట్ పురటిగడ్డలోనే ఈ సారి 12వ ప్రపంచ కప్ పోటీలను నిర్వహించాలని, దీంతో పాటు వేల్స్ లోనూ పలు మ్యాచ్ లను నిర్వహిస్తారని సమాచారం.

క్రిస్ గేల్ డబుల్ సెంచరీ.. గప్టిల్ ప్రపంచ కప్ రికార్డు వ్యక్తిగత స్కోరు.. సంగక్కర వరుస సెంచరీల చరిత్ర.. టోర్నీలో అత్యధిక సెంచరీలు..  సరికొత్త రికార్డులు..  ధోనీసేన అత్యధిక వరుస విజయాలు.. టీమిండియా వరుస మ్యాచ్ లలో అలౌట్ చేసిన ఘనత, న్యూజిలాండ్ జైత్రయాత్ర.. దిగ్గజాల వీడ్కోలు.. ఇలా ఎన్నో చిరస్మరణీయ జ్ఞాపకాలను మిగిల్చింది. సెమీస్లో దక్షిణాఫ్రికా ఓటమి.. ఆఖరి మెట్టుపై న్యూజిలాండ్ నిష్ర్కమణ వంటి గుండెల్ని పిండే క్షణాలు.. ఆసీస్ ఐదోసారి ప్రపంచ కప్ అందుకోవడం అభిమానులకు గుర్తుండిపోతాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2015 ప్రపంచ కప్ అభిమానులకు ఎన్నో చేదు, మధుర స్మృతులను మిగిల్చింది. ఫిబ్రవరి 14న ఆరంభమైన ఈ మెగా ఈవెంట్ మార్చి 29న గ్రాండ్ ఫైనల్తో విజయవంతంగా ముగిసింది. మరి వచ్చే ప్రపంచకప్ ఎన్ని రికార్డులను నెలకొల్పుతుందో వేచి చేద్దామా..!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2019  England  Wales  

Other Articles