No India players in ICC's Team of the 2015 World Cup

Team of the icc cricket world cup 2015 why india pakistan missing

Dhoni, Clarke calls for changes, ICC Cricket World Cup 2015, India, Pakistan missing, No India players in ICC's Team, michael clarke, New zealand and Australia, New zealand versus Australia final, ICC Cricket World Cup 2015 final match, world cup final live updates, cricket world cup final scores, icc cricket world cup finals, 2015 ICC World Cup, Cricket, CWC 2015, World Cup 2015, Brendon McCullum, Daniel Vettori, Kumar Sangakkara, Trent Boult, New Zealand, Australia, Umesh Yadav

Not a single Indian cricketer found a place in the ICC's World Cup XI which was dominated by runners-up New Zealand rather than champions Australia with Black Caps skipper Brendon McCullum as its captain.

ప్రపంచ జట్టులో ఆ ఐదు దేశాలే.. ధోని సేనకు మొండిచెయ్యి

Posted: 03/30/2015 01:16 PM IST
Team of the icc cricket world cup 2015 why india pakistan missing

ఢిపెండింగ్ చాంఫియన్లుగా ప్రపంచకప్ లో అడుగుపెట్టి.. సెమీస్ లో అస్ట్రేలియాతో తలపడి ఓటమి పరాభవంతో వెనుదిరిగిన ధోని సేనకు మరో పరాభవం వెంటపడి వెక్కిరించింది. సెమీ ఫైన్సల్ కు చేరుకున్న అన్ని జట్లకు ప్రాతినిధ్యం లభించగా, కేవలం టీమిండియాకు మాత్రమే ఐసీసీ ప్రపంచ కప్ 2015 జట్టులో స్థానం దక్కలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. లీగ్ దశలో వెనుదిరిగిన దేశానికి, క్వార్టర్ ఫైనల్ లో ఓటమిపాలైన దేశాలకు ప్రపంచ కప్ లో భాగస్వామ్యం లభించినా.. సెమీస్ వరకు వెళ్లి వెనుదిరిగిన భారత క్రికెటర్లకు ఒక్కరికీ స్థానం దక్కలేదు. ఈ మెగా ఈవెంట్లో రాణించిన భారత బౌలర్లు ఉమేష్ యాదవ్ (18), షమీ (17), అశ్విన్ (13) పేర్లు చర్చకు వచ్చినా వారిని జట్టులోకి తీసుకోలేదు.

జట్టులో నలుగురు అసీస్ ఆటగాళ్లు, ముగ్గురు న్యూజీలాండ్ ఆటగాళ్లు, ఇద్దరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, ఒకరు చోప్పున శ్రీలంక, జింబాబ్వే ఆటగాళ్లకు మాత్రమే స్థానం దక్కింది. ఎక్కువగా ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ న్యూజిలాండ్ ఆటగాళ్లున్నారు. ఐసీసీ జట్టు పగ్గాలు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్కు అప్పగించారు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగక్కర, వెటోరిలకు స్థానం దక్కడం విశేషం. లంక వెటరన్ సంగా వరుస సెంచరీలతో రికార్డు సృష్టించడంతో ఆయనకు స్థానం లభించింది. కాగా జింబాబ్వే మాజీ కెప్టన్ బ్రెండన్ టేలర్ కు కూడా 12వ ఆటగాడిగా స్థానం లభించింది. వెటోరిని స్పిన్నర్ కోటాలో ఎంపిక చేశారు. ఇక టాప్ స్కోరర్ మార్టిన్ గప్టిల్తో పాటు స్టీవెన్ స్మిత్, డివిల్లీర్స్, మ్యాక్స్వెల్, కోరీ ఆండర్సన్కు చోటు దక్కింది. బౌలర్ల జాబితాలో టాపర్ స్టార్క్, బౌల్ట్, మోర్నీ మోర్కెల్ను ఎంపిక చేశారు.

ఐసీసీ ప్రకటించిన జట్టు సభ్యులు, దేశాలు
:
* బ్రెండన్ మెకల్లమ్ (కెప్టెన్), (న్యూజీలాండ్)
* మార్టిన్ గుప్తిల్ (న్యూజీలాండ్)
* కుమార సంగక్కర, వికెట్ కీపర్ (శ్రీలంక)
* స్టీవెన్ స్మిత్, (అస్ట్రేలియా)
* ఏబి డివిల్లీర్స్, (సౌత్ ఆఫ్రికా)
* గ్లీన్ మాక్స్ వెల్ (అస్ట్రేలియా)
*  కోరీ ఆండర్సన్ (అస్ట్రేలియా)
* డానియల్ వెటోరి (న్యూజీలాండ్)
vమిచ్చల్ స్టార్క్ (అస్ట్రేలియా)
* ట్రెంట్ బౌల్ట్ న్యూజీలాండ్)
* మార్నీ మోర్కెల్ (అస్ట్రేలియా)
* బ్రెండన్ టేలర్ (12వ వ్యక్తి). (జింబాంబ్వే)

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  New zealand  Australia  

Other Articles