South africa beat zimbabwe after record stand

south africa won against zimbabwe, icc cricket world cup 2015, india score, virat kohli, shikar dhawan, suresh raina, umesh yadav, ravindra jadeja, ashwin, world cup scores, world cup photos, world cup stills, world cup india score, icc world cup. world cup, JP Duminy, David Miller

David Miller and JP Duminy made a record one-day international fifth-wicket stand of 256 as South Africa recovered to beat Zimbabwe in their World Cup opener in Hamilton.

పసికూనపై గెలిచిన దక్షిణాఫ్రికా.. పోరాడి ఓడిన జింబాబ్వే..

Posted: 02/15/2015 07:30 PM IST
South africa beat zimbabwe after record stand

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచకప్ లో భాగంగా పూల్ బిలో పసికూనలపై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో వీరోచితంగా పోరాడిన బింబాబ్వే చిట్టచివరకు ఓటమిని చవిచూసింది. 340 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వే ఆదిలో దూకుడుగా ఆడినా చివర్లో బోల్తాపడి ఓటమిని చవిచూసింది. ఆదిలో సఫారీలను వణికించిన జింబాబ్వే 62 పరుగుల తేడాతో  ఓటమి చెందింది.  ఓ దశలో జింబాబ్వే విజయం సాధించే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే దక్షిణాఫ్రికా పటిష్ట బౌలింగ్ ముందు అండర్ డాగ్ జింబాబ్వే తలవంచక తప్పలేదు.
 
జింబాబ్వే ఆటగాళ్లలో చిబాబా(64), మసకజ్జా (80), టేలర్(40) పరుగులు చేసి కాసేపు సఫారీలకు దడ పుట్టించారు.  కాగా చివరి వరసు ఆటగాళ్ల పూర్తిగా వైఫల్యం చెందడంతో జింబాబ్వే 48.2 ఓవర్లలో 277 పరుగులకే పరిమితమై ఓటమి చెందింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 339 పరుగులు చేసింది

 

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc cricket world cup 2015  south africa  zimbabwe  

Other Articles