Saeed ajmal pakistan bowler fires on umpire steve davis india vs pakistan world cup match

saeed ajmal news, saeed ajmal fires, umpire steve davis, steve davis news, umpire davis news, india vs pakistan match, world cup 2015 updates, india won pakistan, indian cricket team members, pakistan team members

saeed ajmal pakistan bowler fires on umpire steve davis india vs pakistan world cup match : pakistan bowler saeed ajmal slams umpire steve davis for referrel decision during india vs pakistan world cup first match.

అంపైర్ డెవిస్ వల్లే పాకిస్తాన్ కు నష్టం జరిగింది!

Posted: 02/16/2015 01:19 PM IST
Saeed ajmal pakistan bowler fires on umpire steve davis india vs pakistan world cup match

ప్రపంచకప్ సమరంలో భాగంగా పాకిస్తాన్ పై టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే! భారత్ తొలుత బ్యాటింగ్ ఆడి 7 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఇక 301 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. కేవలం 224 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ ఇన్నింగ్స్ లో భారత బౌలర్లదే పైచేయి! టపీటపీమనీ వికెట్లు తీసేయడంతో పాక్ ఆటగాళ్లు వరుసగా పవెలియన్ చేరారు. ఈ విజయంతో ఇండియాలో సంబరాలు అంబరాన్నంటగా.. అటు పాకిస్తాన్ లో మాత్రం తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. కొందరు పాక్ ప్రముఖ ఆటగాళ్లు తమతమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలోనే సయీద్ అజ్మల్ అనే పాక్ స్పిన్నర్ డేవిస్ అనే అంపైర్ పై మండిపడ్డాడు.

పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగిన పోరులో థర్డ్ అంపైర్ గా డేవిస్ బాధ్యతలు చేపట్టాడు. అతడు ఈ మ్యాచ్ రివ్యూలో ఉమర్ అక్మల్ ను ఔట్ గా నిర్ణయం తీసుకున్నాడు. అయితే అతడు తీసుకున్న ఆ నిర్ణయం తప్పని సయీద్ అజ్మల్ అతడిని తప్పుపట్టాడు. మొదట మ్యాచ్ ఓటమిపై ఆవేదన వ్యక్తం చేసిన అజ్మల్.. అనంతరం అంపైర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడు తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం వల్లే పాకిస్తాన్ కు నష్టం జరిగిందని అతడు ఆరోపణలు చేశాడు. అంతేకాదు.. అంపైర్ డేవిస్ తమకెప్పుడూ సమస్యేనంటూ వాపోయాడు. గతంలో తాను ఎన్నిసార్లు అప్పీల్ చేసినా అతడు ఔటివ్వలేదని, ఎప్పుడు చూసినా తమ జట్టుకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని మండిపడ్డాడు.

ఈ నేపథ్యంలోనే అజ్మల్ మాట్లాడుతూ.. ‘‘గతంలో జరిగిన మ్యాచుల్లో నేనే ఎన్నోసార్లు అప్పీల్ చేసినా అంపైర్ డేవిస్ పట్టించుకోలేదు. అతడు మా పాకిస్తాన్ కి ఎప్పుడూ సమస్యే! అందుకే.. మా మ్యాచుల్లో అంపైర్ గా అతడ్ని వద్దని చాలాసార్లు చెప్పాను. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రపంచకప్ లో ఇండియాతో జరిగిన మొదటి మ్యాచ్ లోనూ అతడు తప్పుడు నిర్ణయాన్నే తీసుకున్నాడు. ఉమర్ ఔట్ కాకపోయినా ఔటిచ్చారు. అసలు స్నికో మీటర్ లో ఏమీ చూపించనప్పుడు.. ఉమర్ ఔటని ఎలా నిర్ణయిస్తారు..?’’ అంటూ అజ్మల్ పేర్కొన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan bowler saeed ajmal  umpire steve davis news  india vs pakistan  

Other Articles