India beat pakistan make it 6 out of 6 in world cups

india won against pakistan, team india repeats history against pakistan, history repeats again in world cup, india scored 300 runs against pakistan, pakistan scored 224 runs, icc cricket world cup 2015, india score, virat kohli, shikar dhawan, suresh raina, umesh yadav, ravindra jadeja, ashwin, world cup scores, world cup photos, world cup stills, world cup india score, icc world cup. world cup

Defending champions India launched their Cricket World Cup campaign in style as they produced a clinical performance to spank Pakistan by 76 runs, maintaining their unbeaten record against the arch-rivals in the mega event.

పాకిస్థాన్ పై హిస్టరీ రిపీట్ చేసిన టీమిండియా

Posted: 02/15/2015 07:25 PM IST
India beat pakistan make it 6 out of 6 in world cups

ప్రపంచ కప్ పూల్ బిలో దాయది పాకిస్థాన్తో ఆస్ట్రేలియాలోని అడిలైట్ లో జరిగిన పోరులో భారత్ హిస్టరీని రిపీట్ చేసింది.. ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్లో ఇప్పటి వరకు లిఖించిన చరిత్రనే మళ్లీ టీమిండియా లిఖించి ఆనవాయితీ కొనసాగించింది. డిఫెండింగ్ చాంపియన్ భారత్.. పాక్ను 'ఆరే'సింది. ప్రపంచ కప్ గ్రూప్-బిలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ధోనీసేన ఆల్రౌండ్ షోతో చెలరేగి 76 పరుగులతో పాక్పై ఘనవిజయం సాధించింది. ప్రపంచ కప్లో పాక్పై భారత్కిది ఓవరాల్గా ఆరో విజయం కావడం విశేషం.

301 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ను భారత బౌలర్లు 47 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌట్ చేశారు. పాక్ జట్టులో మిస్బా (76) టాప్ స్కోరర్. మిస్బాకు తోడు షెహజాద్ (47), హారిస్ సొహైల్ (36) మినహా ఇతర పాక్ ఆటగాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లు షమీ నాలుగు, ఉమేష్, మోహిత్ రెండేసి వికెట్ల తీశారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత ఓవర్లో 7 వికెట్లకు 300 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ (107) సెంచరీకి తోడు సురేష్ రైనా (74), ధవన్ (73) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్ సొహైల్ ఖాన్ 5 వికెట్లు తీశాడు. కోహ్లీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.

లక్ష్యఛేదనలో బరిలో దిగిన పాకిస్థాన్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. యువ పేసర్ షమీ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో యూనస్ ఖాన్(6) ను అవుట్ చేశాడు. యూనస్.. ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆనక ప్రమాదకరంగా పరిణమిస్తున్న షెహజాద్, హారిస్ సొహైల్ జోడీని అశ్విన్ విడదీసి మెయిడిన్ వికెట్ తీశాడు. అశ్విన్ బౌలింగ్లో సొహైల్.. రోహిత్ శర్మకు క్యాచిచ్చాడు. 23 ఓవర్లలో పాకిస్థాన్ స్కోరు 101/2. ఈ సమయంలో భారత కెప్టెన్ ధోనీ బంతి ఉమేష్కు ఇచ్చాడు. అంతకుముందు 4 ఓవర్లు వేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఉమేష్ .. ఈ ఓవర్లో రెండు కీలక వికెట్లు పడగొట్టి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు.

ఉమేష్.. షెహజాద్, షోయబ్ మఖ్సూద్ను పెవిలియన్ బాట పట్టించాడు. షెహజాద్ క్యాచ్ను జడేజా అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. ఓ దశలో జడేజా క్యాచ్ డ్రాప్ చేసినట్టు అనిపించినా వెంటనే పట్టుకోవడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఇక మఖ్సూద్ .. రైనాకు దొరికిపోయాడు. ఆ వెంటనే జడేజా.. ఉమర్ అక్మల్ను అవుట్ చేయడంతో పాకిస్థాన్ పీకల్లోతు కష్టాల్లోపడింది.  25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 105 పరుగులే చేయగలిగింది. ఆ తర్వాత పాక్ కోలుకోలేకపోయింది. షమీ ఒకే ఓవర్లో అఫ్రీది, రియాజ్ను అవుట్ చేయడంతో పాక్కు దాదాపుగా ఓటమి ఖాయమైంది. పాక్ కెప్టెన్ మిస్బా ఒంటరి పోరాటం చేసినా ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు. మోహిత్.. సొహైల్ ఖాన్ ను అవుట్ చేయడంతో పాక్ కథ ముగిసింది.

ప్రపంచ కప్లో తమ తొలి మ్యాచ్లోనే  అదరట్టారు.  చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై మెరుపులు మెరిపించారు. భారత ఓపెనర్ రోహిత్ శర్మ (15) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ ధవన్ రాణించాడు. ధవన్కు కోహ్లీ అండగా నిలిచి జట్టును ఆదుకున్నారు.  వీరిద్దరూ రెండో వికెట్కు 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాగా టీమిండియా ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న దశలో ధవన్ రనౌటయ్యాడు. అయితే సురేష్ రైనా క్రీజులో నిలిచి ధవన్ లేని లోటును తీర్చాడు. రైనా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. రైనా, కోహ్లీ మూడో వికెట్కు 110 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీ, రైనా హాఫ్ సెంచరీ చేశారు. ఇక ప్రపంచ కప్లో పాకిస్థాన్పై తొలి సెంచరీ చేసిన భారత ఆటగాడిగా విరాట్ రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో కోహ్లీకిది 22వ శతకం. 45 ఓవర్లలో టీమిండియా స్కోరు 273/2కు చేరింది. కాగా పాక్ బౌలర్ సొహైల్ ఖాన్ వరుస ఓవర్లో కోహ్లీ, రైనాను అవుట్ చేయడంతో స్కోరుబోర్డు మందగించింది. జడేజా 5 బంతులాడి 3 పరుగులకే వెనుతిరగగా, రహానే పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ధోనీ (18) ఫర్వాలేదనిపించినా చివరి ఓవర్లో అవుటయ్యాడు. లేకుంటే భారత్ మరింత భారీ స్కోరు చేసుండేది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc cricket world cup 2015  india  pakistan  

Other Articles