England beat south africa to reach final

England cruise into the final of the Champions Trophy with a convincing seven-wicket victory over South Africa at The Oval.

దక్షిణాప్రికా సీన్ మారలేదు

Posted: 06/20/2013 03:32 PM IST
England beat south africa to reach final

దక్షిణాఫ్రికా... సీమ్ రిపీట్. తమ జట్టుకు ఉన్న ‘చోకర్స్ ’ అనే ముద్రను చెరిపేసుకోక పోగా, కీలకమైన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై చిత్తుగా ఓడి తన చరిత్రను పునరావ్రుతం చేసుకుంది. లీగ్ దశలో బాగా ఆడినా... నాకౌట్‌లో మాత్రం బొక్కబోర్లాపడింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఏ మాత్రం పోరాడకుండా చేతులెత్తేసింది. స్వదేశంలో ఓ పెద్ద టోర్నీ గెలవాలనే ఆకాంక్షను నెరవేర్చుకునే దిశగా కుక్‌సేన మరో అడుగు ముందుకేసింది. ఇంగ్లాండ్ జట్టు సమిష్టిగా రాణించి దక్షిణాఫ్రికా పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ బెర్త్ ను ఖాయం చేసుకుంది.  టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 38.4 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. మిల్లర్ (51 బం తుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ట్రెడ్‌వెల్ (3/19) ధాటికి దక్షిణాఫ్రికా మిడిలార్డర్ కుప్పకూలింది. తర్వాత ఇంగ్లండ్ 37.3 ఓవర్లలో 3 వికెట్లకు 179 పరుగులు చేసి నెగ్గింది. ట్రాట్ (84 బంతుల్లో 82 నాటౌట్; 11 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, రూట్ (71 బంతుల్లో 48; 7 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. ట్రెడ్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అ వార్డు లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more