భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క మన దేశానికి చెందిన మీడియానే కాకుండా ప్రపంచదేశాల మీడియా కూడా ఆయన పై పొగడ్తల వర్షం కురిపించడమే కాకుండా, ఆయన లేని క్రికెట్ ఊహించడం కష్టమే అంటూ రాసి తన అభిమానాన్ని చాటుకున్నాయి. పనిలో పనిగా పాకిస్థాన్ మీడియా కూడా సచిన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ, ప్రత్యేక కథనాలు ప్రచురిస్తూ వీడ్కోలు వరకు చాలా కవరేజ్ ఇచ్చాయి.
ఈ మెచ్చుకోలును చూసిన షేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ కి ఒళ్ళు మండినట్లుంది. అందుకే పాకిస్థాన్ మీడియాకు హెచ్చరికలు జారీ చేసింది కూడా. తాలిబన్ అధికార ప్రతినిధి షాహిదుల్లా షాహిద్ మీడియాతో మాట్లాడిన టేపులను విడుదల చేశారు. షాహిదుల్లా షాహిద్ మాట్లాడుతూ...
భారతదేశానికి చెందిన ఒక ఆటగాడు సచిన్ టెండూల్కర్ చిత్రాన్ని, ఆయనపై ప్రశంసలు చేస్తూ పాకిస్థాన్ మీడియా కథనాలు ప్రసారం చేయడం దురదృష్టకరమని, సచిన్ టెండూల్కర్ గొప్ప ఆటగాడే కావొచ్చు, కానీ అతడు భారతీయుడు అనే విషయాన్ని గుర్తుంచుకుని అతనిపై ప్రశంసలు కురిపించాల్సిన అవసరం లేదని చెప్పారు. పాకిస్థాన్ జట్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్‌పై విమర్శలు చేయడం దారుణమని తెలిపారు. సచిన్‌పై ప్రశంసల వర్షం కురిపించడంతో తాలిబన్ పాకిస్థాన్ మీడియాపై అక్కసును వెళ్లగడాన్ని చూస్తే పాక్ భారతీయుల్నీ ఎలా ట్రీట్ చేస్తున్నారో అర్థం అవుతుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్‌ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more
Nov 25 | వైజాగ్ క్రికెట్ స్టేడియం భారత జట్టుకు అచ్చొచ్చిన స్టేడియం. ఇంత వరకు భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆ రికార్డుతో భారత్ రెండో వన్డేలో కూడా గెలిచి మరో వన్డే మిగిలి ఉండగానే... Read more