India cruise into final at sri lanka expense

icc champions trophy 2013, india vs sri lanka match live updates, live score cards, india vs sri lanka 2nd semi final, champions trophy 2013, champions trophy 2013 india vs sri lanka, champions trophy 2013 2nd semi final, india vs sri lanka, ind vs sl, 2nd semi final, champions trophy, cricket, dhoni, sangakkara, ICC, Cricket, Cricket News, Cricket Events, Cricket LiveScore, ICC champions trophy 2013, ICC champions trophy schedule, ICC champions trophy point table, ICC champions trophy news

World champions India thrashed Sri Lanka by eight wickets at Cardiff today to set up a Champions Trophy final against tournament hosts England at Edgbaston on Sunday.

భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్

Posted: 06/20/2013 02:59 PM IST
India cruise into final at sri lanka expense

ఫైనల్లో భారత్

ఛాంపియన్స్ ట్రోపీలో భారత్ హవా కొనసాగిస్తోంది. రెండో సెమీఫైనల్లో ఎనిమిది వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి ఫైనల్ కు చేరుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి లంకేయులకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. 182 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ, పాడుతూ అలవోకగా ఛేదించింది. ఇంకా 90 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయ ఢంకా మోగించింది. ఓపెనింగ్ జోడి మరోసారి శుభారంభాన్నిచ్చింది. ధావన్, రోహిత్ ల జంట మొదటి వికెట్ కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. ధావన్ విజృంభించి 6 బౌండరీలు, ఒక సిక్సర్ సహాయంతో 68 పరుగులు సాధించాడు. కుదురుగా ఆడుతున్న రోహిత్ (33) అనవసర షాట్ కు ప్రయత్నించి మాథ్యూస్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో జీవన్ మెండిస్ బౌలింగ్ లో ధావన్ స్టంపౌట్ గా వెనుదిరిగినా, వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ 58 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత్ కు ఘన విజయాన్నందించాడు. అంతకు ముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ అటాక్ తో ప్రత్యర్థికి చుక్కలు చూపించారు. భువనేశ్వర్, ఉమేష్, ఇశాంత్ ల పేస్ త్రయం ధాటికి లంకేయులు విలవిలలాడారు. అశ్విన్, జడేజాల స్పిన్ వలలో పడి గిలగిలా కొట్టుకున్నారు. లంక బ్యాట్స్ మెన్లు 50 ఓవర్లపాటూ బ్యాటింగ్ చేసినప్పటికీ 8 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేయగలిగారు. రన్ రేట్ ఏ దశలోనూ నాలుగు దాటలేదు. ఒక దశలో 150 పరుగులు కూడా దాటడం కష్టమే అనిపించినా, నాలుగో వికెట్ కు జయవర్ధనే (38), మాథ్యూస్ (51)ల జంట 78 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టు ఆ మాత్రం పరుగులైనా చేయడానికి కృషి చేశారు. భారత బౌలర్లలో ఇషాంత్, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీయగా, భువనేశ్వర్, జడేజాలు తలో వికెట్ దక్కించుకున్నారు. బౌలింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఇశాంత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఆదివారం బర్మింగ్ హామ్ లో జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఇంగ్లడ్ ను ఢీ కొంటుంది.

టీమిండియా కెప్టెన్ కొత్త అవతారం...

టీమిండియా కెప్టెన్ కొత్త అవతారమెత్తాడు. ఎప్పుడూ వికెట్ల వెనుక ఉండే ధోనీ బౌలింగ్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో బంతి చేత పట్టాడు. పిచ్ సీమర్లకు అనుకూలించడంతో స్వయంగా ధోనీ మీడియం పేస్ బౌలింగ్ వేశాడు. దినేష్ కార్తీక్ కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించిన ధోనీ తానేసిన తొలి ఓవర్ లోనే మాథ్యూస్ ను అవుట్ చేసినంత పని చేశాడు. ఆఫ్ సైడ్ పిచ్ అయిన బంతి వికెట్ల మీదకు రావడంతో మాథ్యూస్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి ప్యాడ్లకు తాకడంతో టీమిండియా అప్పీల్ చేసింది. అంపైర్ అలీందార్ ఔట్ గా ప్రకటించాడు. దీనితో లంక రివ్యూ కోరింది. థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించడంతో శ్రీలంక ఊపిరి పీల్చుకుంది. తానేసిన నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చిన రెగ్యులర్ బౌలర్ వలే లంకను కట్టడి చేశాడు.

 

9. భారత్ బ్యాటింగ్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ చేస్తుంది. ఓపెన్స్ ఆర్ శర్మ, ఎస్ దావన్ నిలకడగా ఆడుతున్నారు. ఇండియా 14 ఓవర్లలో 66 పరుగులు చేసింది. శర్మ 37 బాల్స్ లో 28 పరుగులు చేశాడు. ఎస్ దావన్ 47 బాల్స్ కు 30 పరుగులు చేయటం జరిగింది.. భారత్ లక్ష్యం సాధించాలంటే.. 116 పరుగులు చెయ్యాల్చి ఉంది.

8.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 181 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక ఇన్నింగ్స్ ఆది నుంచి తడబడుతూనే సాగింది. అయితే ఇక భారత్ లక్ష్యం 182..

పరుగులు : 181

ఓవర్లు : 50

వికేట్లు : 8

 7.బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక..

పరుగులు : 171

ఓవర్లు : 49

వికేట్లు : 8

6.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా భారత్ తో సేమీస్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక 158 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 51 (అర్థసెంచరీ )పరుగులు చేసిన మాధ్యూస్ ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు.వెంటనే ఆరో వికెట్ కోల్పోయింది

 పరుగులు : 164

ఓవర్లు : 47.4

వికేట్లు : 7

 5.బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక..

పరుగులు : 145

ఓవర్లు : 44

వికేట్లు : 4

4.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా భారత్ తో సేమీస్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక 119 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన జయవర్థనే రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఔటయ్యాడు

పరుగులు : 127

ఓవర్లు : 41

వికేట్లు : 4

 

3.బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక..

పరుగులు : 95

ఓవర్లు : 31.2

వికేట్లు : 3

2. శ్రీలంక పరుగులు తీయడానికి అపసోపాలు పడుతోంది. 15.2 ఓవర్లలో కేవలం 36 పరుగులు చేసి రెడో వికెట్‌ను కోల్పోయింది. తిరుమన్నే 31 బంతుల్లో ఏడు పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగులో అవుటయ్యాడు. కుమార సంగక్కర 17 పరుగుల వద్ద ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో సురేష్ రైనాకు క్యాచ్ ఇవ్వడంతో శ్రీలంక 18 ఓవర్లకు గాను 41 పరుగుల మూడో వికెట్‌ను కోల్పోయింది.

బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక..

పరుగులు : 47

ఓవర్లు : 20.2

వికేట్లు : 3

1.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న రెండో సెమీపైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డీంగ్ ఎంచుకుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అవుతోంది.

బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక..

పరుగులు : 36

ఓవర్లు : 15

వికేట్లు : 2

 శ్రీలంక ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఆరు పరుగుల వద్ద భువనేశ్వర్ బౌలింగ్ లో కుషాల్ పెరీరా (4) ఔటయ్యాడు

ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు భారత్ , శ్రీలంక మధ్య జరగనున్న సెమీస్ మ్యాచ్ వర్షం కారణంగా అలస్యంగా ప్రారభమ్యే అవకాశంఉంది. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుని ఉన్నందున తగినంత కాంతిలేక ఇంతవరకు టాస్ వేయలేదు..

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, శ్రీలంక మధ్య జరగాల్సిన రెండో సెమీ ఫైనల్ మ్యాచుపై వర్షం దెబ్బ పడింది. గత రాత్రి, గురువారం ఉదయం పడిన వర్షం వల్ల మైదానం తడిగా మారిపోయింది. పిచ్‌ను ఇప్పటికీ కవర్లతో కప్పేసి పెట్టారు. వాటిపై పెద్ద యెత్తన నీళ్లు చేరాయి. దీంతో టాస్ వేయడంలో జాప్యం జరిగింది మొదటి సైమీ ఫైనల్ మ్యాచులో దక్షిణాఫ్రికాపై గెలిచి ఇంగ్లాండు ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. 

ఇండియా జట్టు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), ఆర్ అశ్విన్, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, దినేష్ కార్తిక్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా, ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా, ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ, మురళీ విజయ్, వినయ్ కుమార్, ఉమేష్ యాదవ్ 

 

శ్రీలంక జట్టు: అంజిలో మాథ్యూస్ (కెప్టెన్), దినేష్ చండిమాల్, దిల్హరా లోకుహెట్టిగే, తిలకరత్నే దిల్షాన్, షామిండా ఎరాంగ, రంగన హెరాత్, మహేలా జయవర్ధనే, నువాన్ కులశేఖర, లసిత్ మలింగ, జీవన్ మెండిస్, కుశాల్ పెరెరా, తిషారా పెరెరా, కుమార్ సంగక్కర, సచిత్ర సేనానాయకే, లహిరు తిరమన్నే  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

  దీపికాతో దినేష్ పెళ్లి

  Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

 • Stop praising sachin taliban warn pakistan media

  సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

  Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

 • Shikhar dhawan century india beat wi

  ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

  Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

 • Kanpur 3rd odi ind vs wi live score updates

  కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

  Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

 • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

  తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

  Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more

Today on Telugu Wishesh