డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బెంగళూరు ఛాలెంజర్స్ చిన్నస్వామి స్టేడియంలో చుక్కలు చూపించారు. ఎనిమిది వికెట్‌ల తేడాతో చిత్తుచేశారు. ఏ క్షణంలోనూ నైట్ రైడర్స్‌కు ఊరితీసుకునే అవకాశమే ఇవ్వలేదు. బౌలర్లు ఆర్పీసింగ్, హెన్రిక్వెస్, వినయ్‌కుమార్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తే... మరో వైపు గేల్స్, కొహ్లి, డివియల్లర్స్ కోల్‌కతా బౌలర్లను ఉతికి ఆరేశారు. దీంతో గంభీర్ ఆర్మీ ఛాలెంజర్స్ ముందు చతికిలపడిపోయింది. 155 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఓపెనర్లు క్రిస్ గేల్స్, అగర్వాల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ఐతే మూడో ఓవర్ మూడో బంతికి మెక్ లారెన్ బౌలింగ్‌లో అగర్వాల్ కీపర్ బిస్లాకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. లారెన్ వేసిన స్లో బంతిని స్వీప్ చేయటానికి అగర్వాల్ ప్రయత్నించగా...బిస్లా చక్కని డైవ్‌తో క్యాచ్ అందుకున్నాడు. అగర్వాల్ స్థానంలో వచ్చిన కెప్టెన్ కొహ్లీ మైదానంలో వీరంగం తొక్కాడు. ఓ వైపు గేల్స్, మరోవైపు కొహ్లి బౌలర్లపై విరుచుకు పడ్డారు. ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించారు. నరైన్, కలీస్, బాలాజీ, లారెన్, సంగ్‌వాన్.. ఇలా ఏ బౌలర్‌ను వీరిద్దరూ విడిచిపెట్టలేదు. గతి తప్పిన బంతిని బౌండరీకో... స్టాండ్స్‌కో పంపించి బౌలర్లను కసికొద్దీ శిక్షించారు. ఆరవ ఓవర్లో గేల్స్, కొహ్లి బౌలర్ లారెన్‌కు చుక్కలు చూపించారు. కొహ్లి రెండు ఫోర్లు లాగిస్తే.. గేల్స్ రెండు సిక్స్‌లు బాదాడు. వీరిద్దరూ రెండవ వికెట్‌కి కేవలం 41 బంతులో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బాలాజీ వేసిన తొమ్మిదవ ఓవర్ తొలిబంతిని కొహ్లి స్వీప్ చేయబోయి కవర్స్‌లో మోర్గాన్‌కు దొరికిపోయాడు. 27 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 35 పరుగులు చేసిన కొహ్లి పెవిలియన్‌కు వెనుతిరిగాడు. కొహ్లిస్థానంలో వచ్చిన డివిల్లియర్స్ , గేల్స్‌కు జతకలిశాడు. డివిల్లియర్స్ సహకారంతో గేల్స్ చెలరేగిపోయాడు. దొరికిన బంతిని కసితీరా స్టాండ్స్‌కు పంపించాడు. బాలాజీ బౌలింగ్‌లో గేల్స్ 17.3వ బంతిని సిక్స్ కొట్టి బెంగళూరును గెలిపించాడు. కేవలం రెండు వికెట్‌లు కోల్పోయి 158 పరుగులతో ఛాలెంజర్స్ విజయాన్ని అందుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more