ఆటలోనే కాదు... దాతృత్వంలోను తాము ముందుంటామని ముంబై ఇండియన్స్ జట్టు నిరూపిస్తోంది. నీతా అంబానీ ఆధ్వర్యంలోని ఈ జట్టు శనివారం పుణేతో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ను అనాథ, వికలాంగ బాలలకు అంకితం ఇవ్వనుంది. ‘అందరికీ విద్య’ అనే చారిటీ కార్యక్రమం కోసం ముంబై ఇండియన్స్ ఈ నిర్ణయం తీసుకుంది ఇక్కడ జరిగిన కార్యక్రమంలో జట్టు సభ్యులు విధి వంచితులైన చిన్నారులతో గడిపారు. వారికి ఆటలోని కిటుకులు నేర్పి ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఈ సందర్భంగా మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ... ‘ఇది నాకు ఓ ప్రత్యేకమైన కార్యక్రమం. ఈ చిన్నారుల్లో జాతి గర్వించదగ్గ ప్రతిభ దాగి ఉంది. వారితో గడపడం నాకెంతో ఆనందాన్నిచ్చింది’ అని అన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా... ఈ బాలల శక్తి గురించి తెలుసుకున్నామని ముంబై కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. దాదాపు 8,000 మంది అనాథ, వికలాంగ పిల్లలు శనివారం వాంఖడే స్టేడియానికి వస్తారని ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more