Land assignment act

Land Assignmentap assigned lands, Land Assignment Act, assigned lands

ap assigned lands, Land Assignment Act, assigned lands

అసైన్డ్ భూములు కొంటే...

Posted: 06/27/2013 01:44 PM IST
Land assignment act

ఒక వ్యక్తి హైదరాబాద్‌లోని ఐదు ఎకరాల స్థలం కొని ప్లాట్లు చేసి అమ్ముతుండగా అందులో ఓ 400 గజాల స్థలం కొని ఇంటి నిర్మాణం కోసం దానిని చుట్టూ ప్రహరీ కట్టించుకొన్నాను. దీనికోసం కరెంటు బిల్లు, వాటర్‌ బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాను. ఈ భూమిని రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకున్నాను. ఇప్పుడు స్థానిక రెవెన్యూ అధికారి... ఈ ఐదెకరాల భూమి ఆర్‌వోఆర్‌ ప్రొసీడింగ్స్‌, పాస్‌ పుస్తకం, టైటిల్‌ డీడ్‌ను ఎందుకు రద్దు చేయకూడదో పదిరోజులలో వివరణ ఇవ్వాలనీ, లేని పక్షంలో భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని నోటీస్‌ జారీ చేశారు. ఈ విషయం గురించి నేను హైదరాబాద్‌లోని రెవెన్యూ అధికారులను కలువగా అది అసై న్డ్‌ భూమి అని తెలిసినది. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లే దు. అసలు అసైన్డ్‌ భూమి అంటే ఏమిటి? దానిని ఎలా గుర్తిం చాలి. లావణి పట్టీ అంటే ఏమిటి?

మీరు కొన్న భూమి అసైన్డ్‌ స్థలం అయి నప్పడు మీరు ఏమీ చేయలేరు. కావున వెం టనే ఎవరి వద్ద మీరు ఈ స్థలం కొన్నారో పూర్తి వివరాలతో మీ దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ దానితో పాటు జిల్లా కలెక్టర్‌, మండల రెవెన్యూ అధికారి గారికి విడివిడిగా దరఖాస్తు చేసుకొని జరిగిన విషయాలు వ్రాతపూర్వకంగా తెలియజేసి పత్రము ముట్టినట్లు రశీదు తీసుకోగలరు. తరువాత రెవెన్యూ అధి కారులు విచారణ చేసి దానికి ప్రతిఫ లంగా వేరొక చోట స్థలం గానీ, లేదా అదే స్థలానికి పట్టా ‘డి’ సర్టిఫికెట్‌ గా నీ ఇస్తారు. ఏదేమైనా ఈ విషయం లో సర్వ హక్కులూ రెవెన్యూ అధికారులకే చెందుతా యి. మీరు మంచి న్యాయవాదిని సంప్రదించి కేసు వేసినచో మీకు న్యాయం జరుగుతుంది. మీకు నష్టప రిహారం కావాలను కున్నచో మీకు స్థలం విక్రయిం చిన వ్యక్తిపై సివిల్‌, క్రిమి నల్‌ కేసులు వేయండి.

ఇక మీరు అసైన్డ్‌ భూమి గురించి తెలుపమని అడిగా రు. అసైన్డ్‌ భూమి అనగా ప్రభుత్వానికి చెందిన భూమని అర్థం. దీనిని ప్రభుత్వం వారు భూమి లేని నిరుపేదలకు, స్వాతంత్య్ర సమరయోధుల కు, రాజకీయ బాధితులకు, ఎక్స్‌ సర్వీస్‌మన్‌లకు ఇస్తారు. ఇక మీరు ఈ భూములను ఎలా గుర్తిం చాలంటే...సేత్వార్‌ అంటే అసలైన సర్వే రికార్డు లో చూడటం వలన మనం కొనే భూమికి సం బంధించిన సర్వే నెంబర్‌ గామం పేరు త దితర వివరాలను ప్రతి మండల ఆఫీసులోని చూడ టానికి వీలుంటుంది. అప్పుడు సరైన స్థలం అని నిర్ధారించుకున్న తరువాత భూమిని కొ నుగోలు చేయాలి. అది వ్యవసాయ భూమి అయినా మరేదైనా గానీ, గత 20 సం ముందు నుండి సర్వే రికార్డులో వివరాలు ఉంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles